Lemon And Pepper Drink : శరీరంలో తగినంత వ్యాధి నిరోధక శక్తి ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి వ్యాధులు వచ్చిన కూడా ఎదుర్కొని నిలబడతాం. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గడానికి అనేక కారణాలు ఉన్నాయి. విటమిన్ డి లోపం, పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోకపోవడం, మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం వంటి అనేక కారణాల చేత మనలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. శరీరంలో తగినంత వ్యాధి నిరోధక శక్తి లేకపోతే మనం తరచూ అనారోగ్యాల బారిన పడుతూ ఉంటాం. ప్రస్తుత కాలంలో శరీరంలో తగినంత వ్యాధి నిరోధక శక్తి ఉండడం చాలా అవసరం. ఈ వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడానికి పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.
అంతేకాకుండా ఇంట్లోనే సహాజసిద్ద పదార్థాలతో తయారు చేసిన పానీయాన్ని తీసుకోవడం వల్ల కూడా మనం శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడంతోపాటు మనం అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ పానీయాన్ని తాగడం వల్ల శరీరంలో ఉండే నొప్పులు, వాపులు తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో ఉండే మలినాలు తొలగిపోతాయి. కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
మూత్ర పిండాల్లో ఉండే మలినాలు తొలగిపోతాయి. ఈ పానీయంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలో వ్యాధి నిరోధకతను పెంచే ఈ పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని తయారు చేసుకోవడానికి గాను నిమ్మకాయ, ఒక టీ స్పూన్ తేనె, చిటికెడు కెయాన్ పెప్పర్, చిటికెడు నల్ల మిరియాల పొడి, ఒక కప్పు వేడి నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక కప్పులో నిమ్మరసాన్ని తీసుకోవాలి. తరువాత అందులో కెయాన్ పెప్పర్, నల్ల మిరియాల పొడి, తేనె వేసి బాగా కలపాలి. తరువాత వేడి నీళ్లు పోసి కలపాలి.
ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని కొద్ది సేపు ఫ్రిజ్ లో ఉంచి తాగవచ్చు లేదా తయారు చేసుకున్న వెంటనే కూడా తాగవచ్చు. ఈ పానీయాన్ని రోజూ ఉదయం ఒక కప్పు మోతాదులో తాగడం వల్ల శరీరంలో రోగ నిరధక వ్యవస్థ మెరుగుపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు.