Milk : పాల‌ను ఈ విధంగా త‌యారు చేసుకుని తాగండి.. డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ త‌గ్గిపోతాయి..!

Milk : ప్ర‌స్తుత తరుణంలో చాలా మంది అధిక బ‌రువు, డ‌యాబెటిస్‌, కొలెస్ట్రాల్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. చాలా మందికి ఈ వ్యాధులు వ‌స్తున్నాయి. దీంతో ఇవి గుండె జ‌బ్బుల‌కు దారి తీస్తున్నాయి. హార్ట్ ఎటాక్ ల‌ను క‌ల‌గ‌జేసి ప్రాణాల‌ను పోయేలా చేస్తున్నాయి. అందువ‌ల్ల ఈ వ్యాధులు ఉన్న‌వారు అన్ని విష‌యాల్లోనూ చాలా జాగ్ర‌త్త‌లు పాటించాలి. రోజూ పౌష్టికాహారం తీసుకోవ‌డంతోపాటు వ్యాయామం చేయాలి. అలాగే వైద్యుల సూచ‌న మేర‌కు మందుల‌ను వాడుకోవాలి. ఇక కింద తెలిపిన విధంగా పాల‌ను త‌యారు చేసుకుని తాగితే పైన తెలిపిన స‌మ‌స్య‌లు అన్నింటి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. మ‌రి పాల‌ను ఏ విధంగా త‌యారు చేసుకుని తాగాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

take Milk  in this way by adding ginger and turmeric and get these benefits
Milk

ప‌సుపు కొమ్మును దంచి పేస్ట్‌లా చేయాలి. అందులో నుంచి అర టీస్పూన్ ప‌సుపును తీసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క‌ను కూడా దంచి పేస్ట్‌లా చేయాలి. ఒక గ్లాస్ పాల‌ను తీసుకుని స్ట‌వ్‌పై మ‌రిగించాలి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న ప‌సుపు, అల్లం మిశ్ర‌మాల‌ను వేయాలి. త‌రువాత స‌న్న‌ని మంట‌పై పాల‌ను రెండు మూడు సార్లు పొంగు వ‌చ్చే వ‌ర‌కు మ‌రిగించాలి. అనంత‌రం ఆ పాల‌ను వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే రాత్రి నిద్ర‌కు ముందు తాగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

పైన చెప్పిన విధంగా పాల‌ను తాగ‌డం వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. పసుపులో ఉండే క‌ర్‌క్యుమిన్ షుగ‌ర్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. దీంతో డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే అల్లం బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డుతుంది. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గిస్తుంది. దీంతో గుండె సుర‌క్షితంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. ఇలా పాల‌ను తాగ‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts