Belly Fat : మనలో కొంత మందికి శరీరం అంతా సన్నగా ఉండి పొట్ట దగ్గర మాత్రమే లావుగా ఉంటుంది. వీరికి పొట్ట భాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీని వల్ల వీరు ఊబకాయులుగా కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారు పొట్ట భాగం సన్నగా అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయడం, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే రకరకాల పదార్థాలను కూడా వాడుతూ ఉంటారు. మార్కెట్ లో దొరికే వాటిని వాడడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. పైగా వీటి వల్ల ఫలితం కూడా ఎక్కువగా ఉండదు. శరీరానికి హాని కలగకుండా మన వంటింట్లో ఉండే వాటితోనే ఓ డ్రింక్ ను తయారు చేసుకుని తాగడం వల్ల పొట్ట భాగంలో అధికంగా ఉండే కొవ్వు తగ్గి పొట్ట భాగం సన్నగా అవుతుంది. ఈ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా చిన్న ముక్క అల్లాన్ని, నిమ్మకాయను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లను పోసి, నీళ్లు కొద్దిగా కాగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, నిమ్మకాయ ముక్కలతోపాటుగా అర టీ స్పూన్ పసుపును, ఒక దాల్చిన చెక్కను వేసి ఒక గ్లాసు నీళ్లు అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న నీటిని వడబోసి అందులో ఒకటి లేదా రెండు వేప ఆకుల ముక్కలను కానీ, వాటి పేస్ట్ ను కానీ కలిపి రాత్రి పడుకునే ముందు తాగాలి.
ఇలా తాగడం వల్ల పొట్ట భాగం సన్నగా అవ్వడమే కాకుండా శరీరంలోని ఇతర భాగాలలో పేరుకు పోయిన కొవ్వు కూడా కరిగి ఊబకాయం సమస్య నుండి బయట పడవచ్చు. ఈ డ్రింక్ ను తాగడం వల్ల పొట్ట భాగం సన్నగా అవ్వడమే కాకుండా, రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు కూడా నియంత్రించబడతాయి. ఈ డ్రింక్ ను నెలరోజుల పాటు రాత్రి పడుకునే ముందు క్రమం తప్పకుండా తాగడం వల్ల ఫలితం అధికంగా ఉంటుంది.