Tea : అధిక బరువు సమస్యతో సతమతమయ్యే వారు మనలో చాలా మంది ఉంటారు. ఎంత ప్రయత్నించిన బరువు తగ్గక బరువు కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది. టీ ని తాగడం వల్ల మనం అధిక బరువు సమస్య నుండి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక టీ కాదు బరువును తగ్గించే ఐదు రకాల టీ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనలో చాలా మందికి గ్రీన్ టీ తాగే అలవాటు ఉంది. గ్రీన్ టీ ని తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చని నిపుణులు చెబుతున్నారు.
గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గ్రీన్ టీ ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. గ్రీన్ టీ లో ఉండే పోషకాలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. గ్రీన్ టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కచ్చితంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.
బరువు తగ్గించే రెండవ టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గించడంలో పుదీనా టీ కూడా మనకు సహాయపడుతుంది. పుదీనాలో క్యాలరీలు తక్కువగా నూనెలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో పేరుకుపోయిన కొవ్వును త్వరగా కరిగేలా చేస్తాయి. అంతేకాకుండా ఈ టీ ని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. ఈ పుదీనా టీ ని తయారు చేసుకోవడానికి గాను ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో పుదీనా ఆకులను వేసి 10 నిమిషాల మరిగించాలి. తరువాత ఈ నీటిని ఒక కప్పులోకి వడకట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పుదీనా టీ తయారవుతుంది. దీనిలో రుచి కొరకు తేనెను కూడా కలుపుకోవచ్చు.
ఈ టీ ని తాగడం వల్ల తక్కువ సమయంలో బరువు తగ్గడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. అలాగే త్వరగా బరువును తగ్గించడంలో అల్లం టీ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అధిక బరువును తగ్గించడంలో అల్లం టీ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. అల్లం టీ రుచిగా కూడా ఉంటుంది. ఈ టీ తాగడం వల్ల వేగంగా బరువు తగ్గడంతో పాటు పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగిస్తుంది. ఈ టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండె సక్రమంగా పని చేసేలా చేస్తుంది.
ఈ అల్లం టీ తయారు చేసుకోవడానికి గాను ఒక గిన్నెలో 2 కప్పుల నీళ్లను పోయాలి. ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలను వేసి 15 నిమిషాల పాటు మరిగించాలి. బాగా మరిగిన తరువాత ఈ టీ ని కప్పులోకి వడపోయాలి. దీనిలో అవసరమైతే తేనె, నిమ్మరసం కూడా కలుపుకుని తీసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న అల్లం టీ ని తాగడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.
బరువు తగ్గడంలో ఉపయోగపడే నాలుగవ టీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గడంలో లెమన్ టీ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ టీ ని తాగడం వల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలు తొలగిపోయి రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఈ లెమన్ టీ ని తాగడం వల్ల చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఈ లెమన్ టీ ని తయారు చేసుకోవడనానికి గాను ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అందులో నిమ్మ ఆకులను వేసి మరో 5 నిమిషాల పాటు వేడి చేయాలి. తరువాత ఈ టీ ని వడకట్టాలి. తరువాత ఇందులో ఒక టీ స్పూన్ తేనెను కూడా కలపాలి. ఇలా చేయడం వల్ల లెమన్ టీ తయారవుతుంది. ఈ టీ ని తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఈ లెమన్ టీ ని తరచూ తాగడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని నిపుణులు తెలియజేస్తున్నారు.
మనం వంటల్లో ఉపయోగించే పసుపుతో టీ ని తయారు చేసుకుని తీసుకోవడం వల్ల కూడా బరువు తగ్గవచ్చు. ఈ టీ యాంటీ ఇన్ ఫ్లామేటరీ పదార్థంగా కూడా పని చేస్తుంది. ఇది వేగంగా బరువు తగ్గించడంతో పాటు వ్యాధి నిరోధక వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది. ఈ టీ ని తయారు చేసుకోవడానికి గాను ఒక గిన్నెలో నీళ్లను, పసుపును వేసి మరిగించాలి. తరువాత అందులో ఒక టీ స్పూన్ కచ్చా పచ్చాగా దంచిన మిరియాలను వేసి మరిగించాలి. తరువాత మరో 4 యాలకులను వేసి మరిగించాలి. తరువాత ఈ టీ ని వడకట్టాలి. ఇలా చేయడం వల్ల పసుపు టీ తయారవుతుంది. దీనిని తాగడం వల్ల అధిక బరువు సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు.
ఈ టీ ని తాగడం వల్ల దగ్గు, జలుబు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఇలా ఈ ఐదు రకాల టీ లను తయారు చేసి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మనం ఇతర ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.