Bellam Kobbari Undalu : బెల్లం కొబ్బ‌రి ఉండ‌ల త‌యారీ ఇలా.. రోజుకు 2 తింటే ఎంతో బ‌లం..!

Bellam Kobbari Undalu : మ‌నం వంటింట్లో ప‌చ్చి కొబ్బ‌రిని ఉప‌యోగించి ర‌క‌ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. పచ్చి కొబ్బ‌రిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ప‌చ్చి కొబ్బ‌రిలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో ర‌కాల పోషకాలు ఉంటాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచ‌డంలో, బ‌రువు త‌గ్గ‌డంలో, జీర్ణ శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో ఈ ప‌చ్చి కొబ్బ‌రి మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. దీంతో మ‌నం ఎంతో రుచిగా ఉండే కొబ్బ‌రి ప‌చ్చ‌డిని, కొబ్బ‌రి చ‌ట్నీని, కొబ్బ‌రి అన్నాన్ని త‌యారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా ప‌చ్చి కొబ్బ‌రితో మ‌నం తీపి ప‌దార్థాల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. ప‌చ్చి కొబ్బ‌రితో చేసుకోగ‌లిగే తీపి ప‌దార్థాల‌లో కొబ్బ‌రి ఉండ‌లు కూడా ఒక‌టి. ఈ కొబ్బ‌రి ఉండ‌లు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ఈ కొబ్బ‌రి ఉండ‌ల త‌యారీలో మ‌నం బెల్లాన్ని ఉప‌యోగిస్తాం క‌నుక ఇవి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. బెల్లం, ప‌చ్చి కొబ్బ‌రిని ఉప‌యోగించి ఉండ‌లు ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

బెల్లం కొబ్బ‌రి ఉండ‌ల త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కొబ్బ‌రి కాయ – 1 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది), బెల్లం తురుము – ఒక క‌ప్పు, నెయ్యి – ఒకటిన్న‌ర‌ టీ స్పూన్, జీడి ప‌ప్పు – త‌గిన‌న్ని, నీళ్లు – 20 ఎంఎల్, యాల‌కుల పొడి – పావు టీ స్పూన్.

Bellam Kobbari Undalu very healthy to us make in this method
Bellam Kobbari Undalu

బెల్లం కొబ్బరి ఉండ‌ల త‌యారీ విధానం..

ముందుగా కొబ్బ‌రికాయ‌ను ప‌గ‌ల కొట్టి అందులో నుండి ప‌చ్చి కొబ్బ‌రిని తీసి దానిని ముక్క‌లుగా చేసి జార్ లో వేసి మిక్సీ ప‌ట్టుకోవాలి లేదా ఆ కొబ్బ‌రిని తురుముకోవాలి. త‌రువాత ఒక క‌ళాయిలో అర టీ స్పూన్ నెయ్యిని వేసి జీడిప‌ప‌ప్పును వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌న‌ పెట్టుకోవాలి. త‌రువాత అదే క‌ళాయిలో నెయ్యి వేసి ముందుగా త‌యారు చేసిన పెట్టుకున్న ప‌చ్చి కొబ్బ‌రి తురుమును వేసి వేయించుకోవాలి. కొబ్బ‌రి తురుము వేగిన త‌రువాత బెల్లం తురుమును వేసి బెల్లం క‌రిగే వ‌ర‌కు తిప్పుతూ ఉండాలి. బెల్లం క‌రిగి లేత పాకం వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి.

ఇలా ఉడికించిన త‌రువాత యాల‌కుల పొడి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసి గోరు వెచ్చ‌గా అయ్యే వ‌ర‌కు ఉంచాలి. ఈ మిశ్ర‌మం గోరు వెచ్చ‌గా అయిన త‌రువాత చేతికి నెయ్యిని రాసుకుంటూ కావ‌ల్సిన ప‌రిమాణంలో ఉండ‌లుగా చేసి జీడిప‌ప్పు తో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే బెల్లం కొబ్బ‌రి ఉండ‌లు త‌యార‌వుతాయి. వీటిని గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకోవ‌డం వ‌ల్ల 12 నుండి 15 రోజుల పాటు తాజాగా ఉంటాయి. రోజుకు ఒక‌టి లేదా రెండు చొప్పున ఈ కొబ్బ‌రి ఉండ‌లను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. శ‌రీరానికి అమిత‌మైన బ‌లం క‌లుగుతుంది.

D

Recent Posts