Uppu Shanagalu : శ‌న‌గ‌ల‌ను ఇలా త‌యారు చేసి తినండి.. ఎంతో బ‌లం.. ఆరోగ్య‌క‌రం..!

Uppu Shanagalu : మ‌న వంటింట్లో ఉప‌యోగించే ప‌ప్పు ధాన్యాల‌లో శ‌న‌గ‌లు ఒక‌టి. చాలా కాలం నుండి మ‌నం శ‌న‌గ‌ల‌ను ఆహారంగా తీసుకుంటూ ఉన్నాం. శ‌న‌గ‌ల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులకు శ‌న‌గ‌లు ఎంత‌గానో మేలు చేస్తాయి. వీటిని త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. వీటిలో ఉండే కాల్షియం, ఐర‌న్ వంటి మిన‌ర‌ల్స్ ఎముక‌ల‌ను దృఢంగా ఉంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. శ‌న‌గ‌ల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల బీపీతోపాటు శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. మాన‌సిక స్థితి కూడా మెరుగుప‌డుతుంది.

make Uppu Shanagalu in this way very healthy
Uppu Shanagalu

అజీర్తిని త‌గ్గించ‌డంలో కూడా శ‌న‌గ‌లు స‌హాయ‌ప‌డ‌తాయి. మ‌నం శ‌న‌గ‌ల‌తో గుగిళ్ల‌తోపాటుగా కూర‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. వీటితోపాటు శ‌న‌గ‌ల‌ను ఉప్పు శ‌న‌గ‌లుగా చేసుకుని కూడా తిన‌వ‌చ్చు. ఉప్పు శ‌న‌గ‌లు మ‌న‌కు బ‌య‌ట ఎక్కువ‌గా దొరుకుతూ ఉంటాయి. చాలా సులువుగా, చాలా త‌క్కువ స‌మ‌యంలోనే వీటిని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇంట్లో ఉప్పు శ‌న‌గ‌ల‌ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు శ‌న‌గ‌లు త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, ఉప్పు – 3 క‌ప్పులు.

ఉప్పు శ‌న‌గ‌లు త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో ఉప్పును వేసి పెద్ద మంట‌పై ప‌ది నిమిషాల పాటు వేడి చేయాలి. త‌రువాత శ‌న‌గ‌ల‌ను వేసి పెద్ద మంట‌పై 3 నుండి 4 నిమిషాల పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత జ‌ల్లి గంట‌తో ఉప్పు నుండి శ‌న‌గ‌ల‌ను వేరు చేసుకోవాలి. ఇలా చేయ‌డం వల్ల ఉప్పు శ‌న‌గ‌లు త‌యార‌వుతాయి. ఎటువంటి నూనెను, మ‌సాలాల‌ను వాడ‌కుండా త‌యారు చేసిన ఈ శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. సాయంత్రం స‌మ‌యాల్లో ఆరోగ్యానికి హానిని క‌లిగించే చిరు తిళ్ల‌ను తిన‌డానికి బ‌దులుగా ఇలా ఉప్పు శ‌న‌గ‌ల‌ను త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచిగా ఉండ‌డంతోపాటు శ‌న‌గ‌లను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దీంతోపాటు అనేక పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు.

D

Recent Posts