అధిక బరువు తగ్గాలని చెప్పి చాలా మంది రాత్రి పూట అన్నంకు బదులుగా గోధుమల పిండితో తయారు చేసిన రొట్టెలను తింటుంటారు. నిజానికి అన్నంలో ఎన్ని క్యాలరీలు ఉంటాయో గోధుమ రొట్టెల్లోనూ అన్నే క్యాలరీలు ఉంటాయి. అందువల్ల కొందరు బరువు తగ్గలేకపోతుంటారు. అలాంటి వారు కింద తెలిపిన వివిధ రకాల రొట్టెలను రోజూ తీసుకుంటే ప్రయోజనాలు కలుగుతాయి. అధిక బరువును తగ్గించుకోవచ్చు.
1. జొన్న రొట్టెలు చాలా రుచికరంగా ఉండడమే కాదు, వాటిల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, ఇతర పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఒక్క జొన్న రొట్టెను తింటే చాలు, కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఆహారాన్ని తక్కువగా తీసుకోవచ్చు. ఫలితంగా అధిక బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా షుగర్ లెవల్స్ అదుపులో ఉండాలంటే జొన్న రొట్టె చక్కని ఆహారం అని చెప్పవచ్చు.
2. అనేక తృణ ధాన్యాలను కలిపి తయారు చేసిన మల్టీ గ్రెయిన్ పిండి కూడా మనకు అందుబాటులో ఉంది. ఇది చాలా ఆరోగ్యకరమైంది. అందులో కొద్దిగా శనగపిండిని కలిపి రొట్టెలుగా తయారు చేసుకుని తినవచ్చు. దీని వల్ల అధిక బరువును, షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవచ్చు.
3. ప్రస్తుతం మనకు అనేక రకాల చిరు ధాన్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. రాగులు, సజ్జలు, కొర్రలు.. ఇలా అనేక చిరు ధాన్యాలు లభిస్తున్నాయి. వీటిల్లో దేంతోనైనా సరే రొట్టెలను తయారు చేసుకుని తినవచ్చు. వాటితో అన్నంలా వండుకుని తినలేమని అనుకునేవారు రొట్టెలను తయారు చేసి తినవచ్చు. దీని వల్ల పోషకాలు, శక్తి లభిస్తాయి. అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
4. బార్లీ గింజల పిండితో తయారు చేసిన రొట్టెలను కూడా రోజూ తినవచ్చు. అధిక బరువును త్వరగా తగ్గించుకునేందుకు ఈ పిండి ఎంతగానో సహాయ పడుతుంది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365