వైద్య విజ్ఞానం

మ‌నం తినే ఆహారాల్లో ఉండే ఐర‌న్‌ను శ‌రీరం ఎక్కువ‌గా గ్ర‌హించాలంటే ఏం చేయాలో తెలుసుకోండి..!

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అనేక పోషకాల్లో ఐర‌న్ ఒక‌టి. ఇది ఒక మిన‌ర‌ల్‌. మన శ‌రీరంలో ప‌లు కీల‌క విధుల‌ను నిర్వ‌ర్తించేందుకు ఐర‌న్ అవ‌స‌రం అవుతుంది. దీని వ‌ల్ల హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తి అవుతుంది. ఈ క్ర‌మంలో శ‌రీరంలోని భాగాల‌కు ఆక్సిజ‌న్ స‌రిగ్గా స‌ర‌ఫ‌రా అవుతుంది. ఐర‌న్ వ‌ల్ల శిరోజాలు, చ‌ర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

make your body to get more iron from foods we eat

ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది ఐర‌న్ లోపంతో బాధ‌ప‌డుతున్నారు. దీని వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య వ‌స్తోంది. ముఖ్యంగా మ‌హిళ‌లు ఈ స‌మ‌స్య‌ను ఎక్కువ‌గా ఎదుర్కొంటున్నారు. ర‌క్త‌హీన‌త ఉన్న‌వారిలో అల‌స‌ట‌, త‌ల‌తిర‌గ‌డం, త‌ల‌నొప్పి, ఎండ లేదా చ‌లిని త‌ట్టుకోలేక‌పోవ‌డం, శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తుంటాయి.

మ‌హిళ‌లు రోజూ ఐర‌న్‌ను ఎక్కువ‌గా తీసుకోవాల్సి ఉంటుంది. ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను వారు రోజూ తీసుకుంటే ఐర‌న్ లోపం స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. అయితే కొంద‌రు ఐర‌న్ ఉండే ఆహారాల‌ను తింటున్నా శ‌రీరం ఆ ఐర‌న్‌ను స‌రిగ్గా శోషించుకోలేదు. క‌నుక ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల్సి ఉంటుంది.

ఐర‌న్ మ‌న‌కు ఎక్కువ‌గా మ‌ట‌న్‌, చికెన్‌, చేప‌ల‌తోపాటు గుమ్మ‌డి కాయ విత్త‌నాలు, పాల‌కూర‌, బ్రోక‌లీ, దానిమ్మ‌, యాపిల్స్, ట‌మాటాలు, బాదంప‌ప్పు వంటి వాటిలో ల‌భిస్తుంది. అయితే జంతు సంబంధ ప‌దార్థాల‌ను తింటే వాటిలో ఉండే 40 శాతం ఐర‌న్‌ను మాత్ర‌మే శ‌రీరం గ్ర‌హిస్తుంది. కానీ శాకాహార ప‌దార్థాల‌ను తిన‌డం వ‌ల్ల వాటిలో ఉండే 90 శాతం ఐర‌న్‌ను శ‌రీరం శోషించుకుంటుంది. క‌నుక ఐర‌న్ లోపం ఉన్న‌వారు శాకాహార ప‌దార్థాల‌ను తిన‌డం మంచిది. దీంతో ఐర‌న్‌ను శ‌రీరం ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది.

ఇక శ‌రీరం ఐర‌న్‌ను ఎక్కువ‌గా శోషించుకోవాలంటే అందుకు విట‌మిన్ సి అవ‌స‌రం అవుతుంది. అలాగే విట‌మిన్ ఎ కూడా కావాలి. క‌నుక విట‌మిన్ ఎ, సిలు ఉండే ఆహారాల‌ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. వాటి స‌హాయంతో శ‌రీరం ఐర‌న్‌ను గ్ర‌హిస్తుంది. ఇలా శ‌రీరం ఐర‌న్‌ను ఎక్కువ‌గా శోషించుకునేలా చేయ‌వ‌చ్చు. దీంతో ఐర‌న్ లోపం త‌గ్గుతుంది. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

అయితే ఫైటేట్ లేదా ఫైటిక్ యాసిడ్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను ఐర‌న్ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌తో తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం ఐర‌న్‌ను స‌రిగ్గా శోషించుకోదు. తృణ ధాన్యాలు, చిరు ధాన్యాలు, సోయా, న‌ట్స్, ప‌ప్పు దినుసుల్లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. వీటితో ఐర‌న్ ఉన్న ఆహారాల‌ను క‌లిపి తీసుకుంటే ప్ర‌భావం ఉండ‌దు. ఐర‌న్‌ను శరీరం గ్ర‌హించ‌దు. క‌నుక ఫైటిక్ యాసిడ్ ఉన్న ఆహారాల‌ను తినేట‌ప్పుడు ఐర‌న్ ఉన్న ఆహారాల‌ను వాటితో క‌ల‌ప‌కూడ‌దు. విట‌మిన్ ఎ, సిలు ఉండే ఆహారాల‌తో ఐర‌న్ ఉన్న ఆహారాల‌ను క‌లిపి తినాలి. అలా తింటేనే ఐర‌న్‌ను శ‌రీరం ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది.

టీ, కాఫీలు ఎక్కువ‌గా తాగేవారిలోనూ శ‌రీరం ఐర‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హించ‌దు. క‌నుక ఐర‌న్ లోపం ఉన్న‌వారు దాని నుంచి బ‌య‌ట ప‌డాలంటే టీ, కాఫీల‌ను తాగ‌డం త‌గ్గించాలి. లేదా మానేయాలి. ఇక పురుషుల‌కు రోజుకు 8.7 మిల్లీగ్రాముల మోతాదులో, స్త్రీల‌కు రోజుకు 19 నుంచి 50 మిల్లీగ్రాముల మోతాదులో ఐర‌న్ అవ‌స‌రం అవుతుంది. అలాగే 50 ఏళ్లు పైబ‌డిన మ‌హిళ‌లకు రోజుకు 8.7 మిల్లీగ్రాముల ఐర‌న్ అందేలా చూసుకుంటే చాలు. దీంతో ఐర‌న్ లోపం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts