Oats Smoothie : రోజులో మనం ఉదయం తీసుకునే ఆహారమే ఎక్కువగా ఉండాలని వైద్యలు చెబుతుంటారు. ఉదయం మనం అధిక మొత్తంలో ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఉదయం తినే ఆహారాల్లోనే అధిక మొత్తంలో పోషకాలు ఉండేలా కూడా చూసుకోవాలి. దీంతో మనకు రోజుకు కావల్సిన పోషకాలన్నీ ఉదయం ఆహారంతోనే లభిస్తాయి. అలాగే రాత్రంతా పనిచేసిన శరీరానికి ఉదయమే అధిక మొత్తంలో శక్తి లభిస్తుంది. దీంతో ఉత్సాహంగా ఉంటారు. రోజంతా చురుగ్గా పనిచేస్తారు. అయితే ఉదయం అంతటి పోషకాలున్న ఉత్తమమైన ఆహారాన్ని ఎలా తీసుకోవాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. కానీ కింద చెప్పిన విధంగా ఓట్స్ స్మూతీని తయారు చేసుకుని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా తింటే.. ఎంతో మేలు జరుగుతుంది. మన శరీరానికి కావల్సిన శక్తి మొత్తం ఉదయమే లభిస్తుంది. అలాగే పోషకాలు కూడా లభిస్తాయి. ఇక ఓట్స్ స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ స్మూతీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – 2 టేబుల్ స్పూన్స్, బాదం పప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఖర్జూర పండ్లు – 3, పాలు – ఒక కప్పు, యాపిల్ ముక్కలు – అరకప్పు, చియా విత్తనాలు – అర టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పొడి – పావు టేబుల్ స్పూన్, తేనె – ఒక టేబుల్ స్పూన్.
ఓట్స్ స్మూతీ తయారీ విధానం..
ముందుగా ఖర్జూర పండ్లలోని గింజలను తీసి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో అర కప్పు పాలు పోసి అందులో ఓట్స్ ను, బాదం పప్పును, కట్ చేసి పెట్టుకున్న ఖర్జూర పండ్ల ముక్కలను వేసి మెత్తగా అయ్యే వరకు నానబెట్టుకోవాలి. తరువాత ఒక బ్లెండర్ లో లేదా జార్ లో పాలతోపాటు పాలలో నానబెట్టుకున్న వాటిని, మిగిలిన పదార్థాలన్నింటినీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకుని పైన చియా విత్తనాలతో, బాదం పలుకులతో గార్నిష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓట్స్ స్మూతీ తయారవుతుంది. దీన్ని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకుంటే చాలు. ఎన్నో పోషకాలు లభిస్తాయి. శక్తి అందుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఎంత పని చేసినా అలసిపోరు.