Sprouts Curry : మొలకలతో కూర ఇలా చేయండి.. చపాతీల్లోకి చాలా బాగుంటుంది..!

Sprouts Curry : మొలకలను తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మొలకల్లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని ఉదయాన్నే తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. మన శరీరానికి కావల్సిన పోషకాలు లభించడంతోపాటు వ్యాధుల నుంచి బయట పడవచ్చు. అలాగే శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. కనుక మొలకలను రోజూ తినాలని వైద్యులు చెబుతుంటారు. అయితే మొలకలను నేరుగా తినడం కొందరికి ఇష్టం ఉండదు. కానీ వీటిని కూరగా చేసుకుంటే ఎంతో ఇష్టంగా తింటారు. పైగా చపాతీల్లోకి ఈ కూర అద్భుతంగా ఉంటుంది. కనుక మొలకలను కూరగా చేసుకుంటే ఎంతో రుచిగా తినవచ్చు. దీంతోపాటు ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇక మొలకలతో కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Sprouts Curry is very tasty for Chapati cook it in this way
Sprouts Curry

మొలకల కూర తయారీకి కావల్సిన పదార్థాలు..

దోసకాయ ముక్కలు – ఒక కప్పు, అన్ని రకాల మొలకలు – ఒక కప్పు, జీలకర్ర – ఒక టీస్పూన్‌, ఇంగువ – చిటికెడు, పసుపు – అర టీస్పూన్‌, కారం – టీస్పూన్‌, ధనియాల పొడి – అర టీస్పూన్‌, జీలకర్ర పొడి – అర టీస్పూన్‌, ఉప్పు – రుచికి సరిపడా, కొత్తిమీర తురుము – పావు కప్పు.

మొలకల కూర తయారు చేసే విధానం..

దోసకాయ చెక్కు తీసి చిన్న ముక్కల్లా కట్‌ చేయాలి. బాణలిలో నూనె వేసి జీలకర్ర, ఇంగువ వేసి వేగనివ్వాలి. తరువాత మొలకలు, పసుపు వేసి ఒక కప్పు నీళ్లు పోసి మీడియం మంట మీద సుమారు 10 నిమిషాల పాటు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అందులోనే దోసకాయ ముక్కలు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి అన్నీ కలిపి మూత పెట్టి సిమ్‌లో ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పూర్తిఆ ఉడికిన తరువాత దించి కొత్తిమీర తురుము చల్లితే సరిపోతుంది. దీంతో మొలకల కూర తయారవుతుంది. దీన్ని చపాతీల్లో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు.

Admin

Recent Posts