Aloe Vera : కలబంద.. ఇది మనందరికి తెలిసిందే. మన ఆరోగ్యానికి కలబంద ఎంతో మేలు చేస్తుందని మనందరికి తెలుసు. దీంతో మార్కెట్ లో కలబంద ఉత్పత్తులకు గిరాకీ పెరిగిందని చెప్పవచ్చు. జుట్టును నుండి పాదాల వరకు వాడే అనేక రకాల ఔషధాల్లో కలబందను విరివిరిగా ఉపయోగిస్తున్నారు. నీటి వసతి లేని చోట కూడా కలబంద చక్కగా పెరుగుతుంది. కలబంద వల్ల మనకు ఎంతో కలుగుతుందని మన ఋషులతో పాటు నేటితరం శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కలబంద వల్ల కలిగే ప్రయోజనాలన్ని కూడా శాస్త్రీయంగా నిరూపించబడినవే. కలబందను ఉపయోగించడం వల్ల కలిగే మనకు కలిగే కొన్ని రకాల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రక్షణ వ్యవస్థను మెరుగుపరచడంలో కలబంద మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబందలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కలబంద ఔషధంగా తీసుకున్నాలేదా లేపనంగా రాసుకున్నా, జుట్టుకు రాసుకున్నా, గాయం మీద రాసినా కూడా మనం చక్కటి ఫలితాలను పొందవచ్చు. వైరస్, బ్యాక్టీరియాల వల్ల కలిగే ఇన్పెక్షన్ లను తగ్గించడంలో ఈ కలబంద మనకు ఎంతో ఉపయోగపడుతుంది. కలబందలో ఉండే సాల్సిలిక్ యాసిడ్, ఫినాల్స్, సల్ఫర్, నైట్రోజన్, యూరియా , సినామినిక్ వంటి పోషకాల కారణంగానే మనం ఈ ఇన్ఫెక్షన్ ల బారి నుండి బయటపడగలుగుతున్నామని పరిశోధనల ద్వారా వెల్లడైంది.
అలాగే దీనిలో గిబ్బర్లిన్ అనే రసాయం కారణంగా గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి. కాలిన గాయాలపై, దెబ్బలపై కలబందను రాయడం వల్ల దీనిలో ఉండే గిబ్బర్లిన్ గాయాలు త్వరగా మాని చర్మం సాధారణ స్థితికి వచ్చేలా చేయడంలో సహాయపడుతుంది. కలబంద గుజ్జును తినడం వల్ల ప్రేగుల్లో కదలికలు పెరుగుతాయి. దీంతో సుఖ విరోజనం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే దీనిలో బ్రెడీ కైనేజ్ అనే ఎంజైమ్ ఇన్ ప్లామేషన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. కలబంద గుజ్జును లోపలికి తీసుకున్నా లేదా లేపనంగా వాడిన కూడా ఇన్ ప్లామేషన్ తగ్గుతుంది. మన శరీరంలో రక్షణ వ్యవస్థ ఎక్కువగాపని చేసినప్పుడు దాని ప్రభావం మన శరీరంపై వ్యతిరేకంగా ఉంటుంది.
అలాంటప్పుడు ఈ కలబందను తీసుకోవడం వల్ల దీనిలో ఉండే అల్ప్రోజన్ అనే రసాయనం రక్షణ వ్యవస్థ సరిగ్గా సమర్థవంతంగాపని చేసేలా చేయడంలో సహాయపడుతుంది. చర్మ సౌందర్యాన్ని పెంచడంలో, జుట్టును సంరక్షించడంలో కూడా ఈ కలబంద మనకు దోహదపడుతుంది. ఇవే కాకుండా కలబందను ఉపయోగించి మనం ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కలబంద నేల మీద అలాగే కుండీల్లో కూడా చక్కగా పెరుగుతుంది. దీనికి ఎక్కువగా సస్యసంరక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కొద్దిగా ఎండ తగిలే ప్రదేశంలో ఉంచితే ఈ కలబంద చాలా చక్కగా పెరుగుతుంది. ఇలా ఇంట్లో సహజ సిద్దంగా పెంచుకున్న కలబందను ఉపయోగించడం వల్ల మనం అధిక ప్రయోజనాలను పొందవచ్చు. కలబందను తగిన మోతాదులో ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.