Ashwagandha : మనకు వచ్చే అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేసే ఔషధ మొక్కల్లో అశ్వగంధ మొక్క కూడా ఒకటి. ఈ మొక్క గురించి అలాగే దీనిలోని ఔషధ గుణాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దీని శాస్త్రీయ నామం విథానియా సామ్నిఫెరా. అలాగే దీనిని ఇంగ్లీష్ లో ఇండియన్ జెన్సింగ్ అని, అలాగే తెలుగులో పెన్నేరు గడ్డ అని పిలుస్తారు. అశ్వం అలాంటి వాసన వస్తుంది కనుక దీనికి అశ్వగంధ అని పేరు వచ్చింది. అలాగే దీనిని ఉపయోగించడం వల్ల అశ్వానికి ఉన్నంత శక్తి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క కేవలం 35 నుండి 75 సెంటిమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఈమొక్క వేర్లు లావుగా గడ్డలాగా పెరుగుతాయి. అశ్వగంధ మొక్కను ఆయుర్వేదంలో విరివిరిగా ఉపయోగిస్తారు. అశ్వగంధ తీపి, కారం, చేదు రుచులను కలిగి ఉంటుంది. వాత,కఫ వ్యాధులను నయం చేయడంలో ఇది ఎంతో దోహదపడుతుంది.
అశ్వగంధాన్ని చూర్ణంగా, కషాయంగా, లేహ్యంగా ఎలాగైనా తీసుకోవచ్చు. అశ్వ గంధ పొడిని 3 గ్రాముల మోతాదులో పాలల్లో కలిపి తీసుకోవచ్చు. అలాగే తేనెతో కలిపి కూడా తీసుకోవచ్చు. కీళ్ల నొప్పులను తగ్గించడంలో, కీళ్ల వాపులను తగ్గించడంలో అశ్వగంధ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వారు పెయిన్ కిల్లర్ లను వాడడానికి బదులుగా ఈ అశ్వగంధ చూర్ణాన్ని వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. అలాగే అశ్వగంధను ఉపయోగించడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. పురుషుల్లో టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో ఇది సహాయపడుతుంది. అశ్వగంధ చూర్ణాన్ని 2 నుండి 3 గ్రాముల మోతాదులో తీసుకుని దానికి సమానంగా ఆవు నెయ్యి, తేనె, పంచదారను కలిపి తీసుకోవాలి. దీంతో పురుషుల్లో వీర్య కణాల సంఖ్య పెరుగుతుంది.

సంతాన లేమి సమస్యలను, శీఘ్రస్కలనం సమస్యలు తగ్గుతాయి. అలాగే దీనిని వాడడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అశ్వగంధను ఉపయోగించడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. నరాల బలహీనత సమస్య తగ్గుతుంది. అలాగే కండరాలు ధృడంగా తయారవుతాయి. అమితమైన బలం కలుగుతుంది. అలాగే ఒత్తిడి, మానసిక ఆందోళన వంటి వాటిని తగ్గించడంలో కూడా అశ్వగంధ మనకు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో అశ్వగంద మనకు దోహదపడుతుంది. అశ్వగంద పొడిని పంచదారతో కలిపి తీసుకుంటే నిద్రలేమి తగ్గుతుంది.
ఎముకలను, దంతాలను ధృడంగా ఉంచడంలో, రక్తపోటును అదుపులో ఉంచడంలో అశ్వగంధ ఉపయోగపడుతుంది. అలాగే చర్మం, జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించి వాటిని ఆరోగ్యంగా ఉంచడంలో అశ్వగంధ తోడ్పడుతుంది. అలాగే క్షయ వ్యాధిని నివారించడంలో కూడా దీనిని విరివిరిగా ఉపయోగిస్తారు. ఈ విదంగా అశ్వగంధ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని వాడడం వల్ల మనం అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని ఆయుర్వే ద నిపుణులు చెబుతున్నారు.