మిరియాలను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. భారతీయుల వంటి ఇంటి దినుసుల్లో ఒకటి. వీటిల్లో తెల్లవి, నల్లవి.. అని రెండు రకాల మిరియాలు ఉంటాయి. కానీ మనం ఎక్కువగా నల్ల మిరియాలనే వాడుతుంటాం. అయితే మిరియాల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటితో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అజీర్ణ సమస్య ఉన్నవారు ఆహార పదార్థాలపై కొద్దిగా మిరియాల పొడిని చల్లి తింటే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. లేదా భోజనం చేసిన తరువాత ఒక టీస్పూన్ తేనెలో చిటికెడు మిరియాల పొడి కలిపి తీసుకోవచ్చు. దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
2. ఒక టీస్పూన్ తేనెలో చిటికెడు మిరియాల పొడి కలిపి పూటకు ఒకసారి తీసుకుంటుండాలి. దగ్గు, జలుబు తగ్గుతాయి. అలాగే గోరు వెచ్చని నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి కలిపి కూడా తీసుకోవచ్చు. దీంతో కూడా ఆయా సమస్యలు తగ్గుతాయి.
3. భోజనం చేసిన వెంటనే చిటికెడు మిరియాల పొడిని నీటితో కలిపి తీసుకుంటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు వేగంగా ఖర్చవుతాయి. అధిక బరువును తగ్గించుకోవచ్చు.
4. తేనె లేదా పెరుగులో కొద్దిగా మిరియాల పొడి కలిపి పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి ఫేస్ ప్యాక్ మాదిరిగా వేసుకోవాలి. కొంత సేపు ఉన్నాక కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.
5. మిరియాల పొడిని నీటిలో వేసి మరిగించిన డికాషన్‌ను అర కప్పు మోతాదులో రోజుకు రెండు సార్లు తాగుతుండాలి. దీంతో ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
6. మిరియాలలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అవి క్యాన్సర్ రాకుండా చూస్తాయి. అందువల్ల మిరియాలను రోజూ తీసుకుంటే క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
7. మెదడు పనితీరుకు మిరియాలు ఎంతో పనిచేస్తాయి. రాత్రి పూట ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగుతుంటే నిద్ర చక్కగా పడుతుంది. దగ్గు, జలుబు తగ్గుతాయి. అజీర్ణం నుంచి బయట పడవచ్చు.
8. మిరియాల పొడిలో కొద్దిగా ఉప్పు, నీరు కలిపి ఆ మిశ్రమంతో రోజూ దంతాలను తోముకోవాలి. దీంతో దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ల వాపులు తగ్గుతాయి, నోటి దుర్వాసన నుంచి బయట పడవచ్చు.
9. మిరియాల పొడి, నిమ్మరసంలను కొద్ది మోతాదులో తీసుకుని కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు బాగా రాయాలి. 15 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు సమస్య తగ్గుతుంది.
10. మిరియాల పొడిని రోజూ ఉదయం, సాయంత్రం భోజనానికి ముందు తీసుకుంటుండాలి. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది.