ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక శాతం మంది పొగ తాగేవారు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచం మొత్తం మీద పొగ తాగే వాళ్లలో 12 శాతం మంది భారత్‌లోనే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో ఏటా పొగ తాగడం వల్ల 1 కోటి మందికి పైగానే చనిపోతున్నారు. అయితే కేవలం పొగ తాగడం మాత్రమే కాదు, కింద తెలిపిన పలు అలవాట్లు కూడా పొగ తాగడం అంత ప్రమాదకరమైనవి. మరి ఆ అలవాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవించడం కూడా ఒక అలవాటే. కానీ అది పొగతాగడం కన్నా ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పొగ తాగితే అనారోగ్య సమస్యలు వచ్చి చనిపోయేందుకు చాలా ఏళ్లు పడుతుంది. కానీ తీవ్రమైన ఒంటరి తనం అనేది మనిషిని చాలా కుంగదీస్తుంది. దీంతో మనిషి ఎప్పుడు చనిపోతాడో తెలియదు. అందుకని తీవ్రమైన ఒంటరితనం అనేది పొగ తాగడం కన్నా ప్రమాదకరమైంది అని చెప్పవచ్చు. మన దేశంలో దాదాపుగా 22 శాతం మంది ఈ పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందువల్ల దీని నుంచి బయట పడితే ఆరోగ్యంగా ఉండవచ్చు.
2. పోషకాహార లోపం కూడా చాలా మందిలో ఉంటోంది. పోషకాల లోపం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. దీంతో ఆరోగ్యంపై చాలా ప్రభావం పడుతుంది. పట్టించుకోకపోతే తీవ్రమైన వ్యాధులు వస్తాయి. కనుక పొగ తాగడం కన్నా ఇది ప్రమాదకరమైందని చెప్పవచ్చు. రోజూ అన్ని పోషకాలు ఉండే ఆహారాలను తీసుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
3. నిద్రలేమి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. దీని వల్ల అధికంగా బరువు పెరుగుతారు. డయాబెటిస్, గుండె జబ్బులు వస్తాయి. స్మోకింగ్ వల్ల ఎలాంటి హాని కలుగతుందో నిద్రలేమి వల్ల కూడా దాదాపుగా మన శరీరానికి అలాంటి హానే జరుగుతుంది. అందువల్ల నిద్రలేమి నుంచి బయట పడాలి.
4. మనలో చాలా మందికి నెగెటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కనుక ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఉండడం అలవాటు చేసుకోవాలి.
5. చాలా మంది వ్యాయామం చేయరు. రోజూ గంటల తరబడి కూర్చుని పనిచేస్తుంటారు. దీని వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఇది కూడా స్మోకింగ్ అంతటి హాని కలగజేస్తుంది. కనుక సెడెంటరీ లైఫ్ స్టైల్‌ను మానుకోవాలి. మధ్య మధ్యలో విరామం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. శారీరకంగా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి.