Mustard : ఆయుర్వేదం ప్ర‌కారం ఆవాల‌ను ఎన్ని విధాలుగా ఉప‌యోగించ‌వ‌చ్చో తెలుసా..?

Mustard : మ‌న వం గ‌దిలో పోపుల డ‌బ్బాలో ఉండే దినుసుల్లో ఆవాలు ఒక‌టి. ఇవి మ‌నంద‌రికి తెలిసిందే. తాళింపుల్లో వీటిని ఎక్కువ‌గా వాడతారు. ఆవాలు వేయ‌నిదే మ‌నం కూర‌ల‌ను త‌యారు చేయ‌ము. అలాగే ఆవ పిండి మ‌నం ప‌చ్చ‌ళ్ల‌ల్లో త‌యారీలో ఉప‌యోగిస్తాము. ఆవాల నుండి తీసిన నూనెను కూడా మ‌నం వంట‌ల్లో ఉప‌యోగిస్తాము. వంట‌ల్లో వాడ‌డంతో పాటు ఆయుర్వేదంలో ఔష‌ధాల త‌యారీలో కూడా ఆవాల‌ను ఉప‌యోగిస్తారు. ఆవాల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఆవాల‌ను అలాగే ఆవ నూనెను వాడి మ‌నం ఎన్నో ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసుకోవ‌చ్చు. ఆవ నూనెను అలాగే ఆవాల‌ను వాడ‌డం వ‌ల్ల మ‌నం ఏయే ఏయే అనారోగ్య స‌మ‌స్య‌లను దూరం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవాల‌ను సంస్కృతంలో స‌ర్ష‌ప అని, హిందీలో స‌ర‌సో, రాయి అని పిలుస్తారు. ఆవాలు మ‌న‌కు ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో దొరుకుతాయి. ఇవి కార‌పు రుచిని క‌లిగి వేడి చేసే గుణాన్ని క‌లిగి ఉంటాయి. తేలు విషాన్ని హరించే గుణం కూడా ఆవాల‌కు ఉంది. ఆవాలు, ప‌త్తిఆకులు క‌లిపి మెత్త‌గా నూరాలి. ఈ మిశ్ర‌మాన్ని తేలు కుట్టిన చోట ఉంచితే విషం హ‌రించుకుపోతుంది. అలాగే ఆవాల నూనెను 50 గ్రాముల మోతాదులో తీసుకుని గోరు వెచ్చ‌గా చేయాలి. త‌రువాత ఇందులో 20 అమృత‌ధార చుక్క‌ల‌ను క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని చ‌ర్మంపై రాస్తే దుర‌ద‌లు, ద‌ద్దుర్లు వెంట‌నే త‌గ్గుతాయి. ఆవాల‌ను దోర‌గా వేయించి పొడిగా చేయాలి. ఈ పొడిని రెండు చిటికెల మోతాదులో రాత్రి భోజ‌నంలో మొద‌టి ముద్ద‌గా తింటే పెద్ద‌ల‌కు బ‌ట్ట‌ల‌ల్లో మూత్రం ప‌డ‌కుండా ఉంటుంది. నీళ్ల విరేచ‌నాల‌ను త‌గ్గించ‌డంలో ఆవాలు చ‌క్క‌గా ప‌ని చేస్తాయి.

home remedies in telugu using Mustard
Mustard

దోర‌గా వేయించిన ఆవాల‌ను, బెల్లాన్ని స‌మానంగా తీసుకుని మెత్త‌గా దంచాలి. ఈ మిశ్ర‌మాన్ని బ‌ఠాణీ గింజ‌లంత మాత్ర‌లుగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ మాత్ర‌ల‌ను పూట‌కు ఒక‌టి చొప్పున రెండు పూట‌లా తీసుకుంటే నీళ్ల విరోచ‌నాలు త‌గ్గుతాయి. అలాగే ఆవాల‌ను మంచి నీటితో క‌లిపి మెత్త‌గా నూరాలి. ఈ మిశ్ర‌మాన్ని ముక్కు ద‌గ్గ‌ర వాస‌న త‌గిలేట‌ట్టు ఉంచితే మూర్ఛ వ‌ల్ల స్పృహ కోల్పోయిన వారికి వెంట‌నే మెలుకువ వ‌స్తుంది. అలాగే బోద‌కాలును హ‌రించే గుణం కూడా ఆవాల‌కు ఉంది. ఆవాలు, ఉమ్మెత్తాకులు, ఆముద‌పు చెట్టు వేర్లు, మున‌గ చెట్టు బెర‌డు.. వీట‌న్నింటిని స‌మానంగా తీసుకుని నీటితో క‌లిపి మెత్త‌గా నూరాలి. ఈ మిశ్ర‌మాన్ని బోద‌కాలు వాపుల‌పై రాసి క‌ట్టు క‌డితే క్ర‌మంగా వాపులు త‌గ్గుతాయి. దానిమ్మ బెరడును త‌గినంత ఆవ నూనెతో క‌లిపి మెత్త‌గా నూరాలి.

త‌రువాత దాని నుండి ర‌సాన్ని తీసి నిల్వ చేసుకోవాలి. స్త్రీలు ఈ ర‌సాన్ని రాత్రి ప‌డుకునే ముందుగ స్థ‌నాల‌పై రాసుకుని మ‌ర్ద‌నా చేసుకోవాలి. త‌రువాత దూదిని ఉంచి బిగుతైన లో దుస్తుల‌ను ధ‌రించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల స్త్రీలల్లో స్థ‌నాలు బిగుతుగా త‌యార‌వుతాయి. ఆవ‌నూనె 50 గ్రాములు, న‌ల్ల తుమ్మ చెట్టు పూలు 20 గ్రాములు మోతాదులో తీసుకోవాలి. ఆవ‌నూనెలో ఈ పూల‌ను వేసి చిన్న మంట‌పై పూలు న‌ల్ల‌గా అయ్యే వ‌ర‌కు వేడి చేసి వ‌డ‌క‌ట్టుకుని నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను రోజుకూ రెండు పూట‌లా మూడు నుండి నాలుగు చుక్క‌ల మోతాదులో చెవిలో వేసుకోవ‌డం వ‌ల్ల చెవి నుండి చీము కార‌డం, చెవి పోటు, చెవిలో దుర‌ద వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. ఆవాల‌ను దోర‌గా వేయించి పొడిగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని అర గ్రాము మోతాదులో అర క‌ప్పు పెరుగులో క‌లిపి ఉద‌యాన్నే తినిపించాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల పిల్ల‌ల క‌డుపులో ఉండే నులిపురుగులు న‌శిస్తాయి. పిల్ల‌లు ప‌ళ్లు కొర‌కుండా ఉంటారు. ఎండుమిర‌ప‌కాయ‌ల‌ను ఆవ‌నూనెతో క‌లిపి మెత్త‌గా నూరాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని కుక్క క‌రిచిన ఉంచి క‌ట్టు క‌ట్టాలి. నాలుగు రోజుల పాటు ఈ క‌ట్టుపై నీళ్లు ప‌డ‌కుండా చూసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కుక్క కాటు విషం హ‌రించుకుపోతుంది. ఈ విధంగా ఆవాలు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయని వీటిని వాడ‌డం వ‌ల్ల మ‌నం మ‌రెన్నో ఆరోగ్య ప్ర‌యోజనాలను సొంతం చేసుకోవ‌చ్చ‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts