బంతి పువ్వులు, ఆకులు.. ఔషధ గుణాలు మెండు.. అనారోగ్య సమస్యలను ఇలా తగ్గించుకోవచ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన చుట్టూ పరిసరాల్లో బంతి పూల మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి&period; బంతిపూలను సహజంగానే అలంకరణలకు&comma; పూజల్లోనూ ఉపయోగిస్తారు&period; అయితే ఆయుర్వేద పరంగా ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయ&period; ఈ మొక్క పువ్వులు&comma; ఆకులతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు&period; వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-4566 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;marigold-flower-1&period;jpg" alt&equals;"home remedies using marigold flower and leaves banthi puvvulu akulu " width&equals;"1200" height&equals;"900" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; బంతి పువ్వు ఒకటి&comma; కొన్ని ఆకులను సేకరించి దంచి రసం తీయాలి&period; దాన్ని గాయాలు&comma; పుండ్లపై రాసి కట్టు కట్టాలి&period; ఇలా రోజూ చేస్తుంటే గాయాలు&comma; పుండ్లు త్వరగా తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; ఆయాసంగా ఉన్నవారు బంతి పూలను ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది&period; బంతిపూల మధ్యలో ఉండే తెల్లని బొడ్లను సేకరించి ఎండబెట్టి పొడి చేయాలి&period; దాన్ని తియ్యని పెరుగు&comma; చక్కెరలతో కలిపి తినాలి&period; దీంతో ఆయాసం తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; బంతి పువ్వుల రసం లేదా బంతి పూల ముద్దను వెన్న లేదా నెయ్యిలో వేయించి తీసుకుంటుండాలి&period; దీంతో నోట్లో నుంచి రక్తం పడడం&comma; అర్శమొలలు&comma; ఎర్రబట్ట వంటి సమస్యలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; బంతి పువ్వులు&comma; ఆకులను సేకరించి వాటిని దంచి రసం తీయాలి&period; దాన్ని 2 టీస్పూన్ల మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా యహూద్‌ భస్మాన్ని కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి&period; దీంతో కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి&period; యాహూద్‌ భస్మం ఆయుర్వేద మందుల షాపుల్లో లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; బంతి పువ్వుల రెక్కలు 1 కిలో&comma; బంతి ఆకుల రసం 1 లీటర్&comma; నువ్వుల నూనె అర లీటర్‌ తీసుకుని వీటిని ఒక పాత్రలో వేసి మీడియం మంటపై కషాయంలా కాయాలి&period; ఈ క్రమంలో నీరు ఆవిరి అయ్యే వరకు మరిగించాలి&period; తరువాత ఏర్పడే తైలాన్ని సేకరించి సీసాలో నిల్వ చేయాలి&period; దీన్ని కీళ్లపై రాస్తుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి&period; తలపై రాస్తే తలనొప్పి తగ్గుతుంది&period; చెవిలో రెండు చుక్కలు వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది&period; చర్మంపై ఏర్పడే కురుపులపై రాస్తే కురుపులు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-4565" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2021&sol;08&sol;marigold-flower-2&period;jpg" alt&equals;"" width&equals;"499" height&equals;"335" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; బంతి పువ్వుల రెక్కలకు తగినంత ఉప్పు&comma; జీలకర్ర&comma; కరివేపాకుల పొడిని కలిపి నెయ్యితో కొద్దిగా వేయించి తీసుకుంటే వేడి తగ్గుతుంది&period; మలద్వారం నుంచి రక్తం పడడం తగ్గుతుంది&period; మూత్రమార్గాల్లో ఉండే రాళ్లు పోతాయి&period; పైత్యం&comma; వికారం తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; బంతి పువ్వుల రెక్కలు&comma; బంతి మొక్క లేత ఆకులను సేకరించి మిరియాల గింజలతో కలిపి నూరి నీళ్లతో తీసుకుంటే మూత్రంలో వచ్చే చీము తగ్గుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">8&period; బంతి పువ్వులను పది గ్రాముల మోతాదులో తీసుకుని శుభ్రమైన మట్టి పెంకుల మీద కాల్చి 10 గ్రాముల ఆవు నెయ్యి&comma; చిటికెడు పచ్చ కర్పూరాన్ని కలిపి బాగా మర్దించి ఉంచుకోవాలి&period; దీన్ని కంటికి కాటుక మాదిరిగా పెట్టుకుంటే కంటి దురద&comma; అలర్జీలు&comma; కళ్ల నుంచి నీరు కారడం&comma; కళ్ల మంట తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">9&period; బంతి పువ్వుల గింజల పొడిలో సమాన భాగం చక్కెర కలిపి ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుంటే అతి కామోద్రేకం తగ్గుతుంది&period; మనస్సు ప్రశాంతంగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">10&period; ఒక కిలో బంతి పువ్వులను కలాయిలో వేసి అందులో రెండు లీటర్ల నీరు పోసి ఒక రోజు ఉంచి అర్క యంత్రం ద్వారా అర్కం తీసి &lpar;డిస్టిలేషన్‌&rpar; సీసాలో నిల్వ చేసుకోవాలి&period; దీన్ని ఒక టీస్పూన్‌ మోతాదులో సమాన భాగం నీళ్లు కలిపి తీసుకుంటే రక్త వికారాలు&comma; అర్శ మొలలు&comma; హస్త పాదాల్లో మంటలు తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts