Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆరోగ్యం

బంతి పువ్వులు, ఆకులు.. ఔషధ గుణాలు మెండు.. అనారోగ్య సమస్యలను ఇలా తగ్గించుకోవచ్చు..!

Admin by Admin
August 1, 2021
in ఆరోగ్యం, మూలిక‌లు
Share on FacebookShare on Twitter

మన చుట్టూ పరిసరాల్లో బంతి పూల మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. బంతిపూలను సహజంగానే అలంకరణలకు, పూజల్లోనూ ఉపయోగిస్తారు. అయితే ఆయుర్వేద పరంగా ఈ మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయ. ఈ మొక్క పువ్వులు, ఆకులతో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

home remedies using marigold flower and leaves banthi puvvulu akulu

1. బంతి పువ్వు ఒకటి, కొన్ని ఆకులను సేకరించి దంచి రసం తీయాలి. దాన్ని గాయాలు, పుండ్లపై రాసి కట్టు కట్టాలి. ఇలా రోజూ చేస్తుంటే గాయాలు, పుండ్లు త్వరగా తగ్గుతాయి.

2. ఆయాసంగా ఉన్నవారు బంతి పూలను ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. బంతిపూల మధ్యలో ఉండే తెల్లని బొడ్లను సేకరించి ఎండబెట్టి పొడి చేయాలి. దాన్ని తియ్యని పెరుగు, చక్కెరలతో కలిపి తినాలి. దీంతో ఆయాసం తగ్గుతుంది.

3. బంతి పువ్వుల రసం లేదా బంతి పూల ముద్దను వెన్న లేదా నెయ్యిలో వేయించి తీసుకుంటుండాలి. దీంతో నోట్లో నుంచి రక్తం పడడం, అర్శమొలలు, ఎర్రబట్ట వంటి సమస్యలు తగ్గుతాయి.

4. బంతి పువ్వులు, ఆకులను సేకరించి వాటిని దంచి రసం తీయాలి. దాన్ని 2 టీస్పూన్ల మోతాదులో తీసుకుని అందులో కొద్దిగా యహూద్‌ భస్మాన్ని కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. దీంతో కిడ్నీ స్టోన్లు కరిగిపోతాయి. యాహూద్‌ భస్మం ఆయుర్వేద మందుల షాపుల్లో లభిస్తుంది.

5. బంతి పువ్వుల రెక్కలు 1 కిలో, బంతి ఆకుల రసం 1 లీటర్, నువ్వుల నూనె అర లీటర్‌ తీసుకుని వీటిని ఒక పాత్రలో వేసి మీడియం మంటపై కషాయంలా కాయాలి. ఈ క్రమంలో నీరు ఆవిరి అయ్యే వరకు మరిగించాలి. తరువాత ఏర్పడే తైలాన్ని సేకరించి సీసాలో నిల్వ చేయాలి. దీన్ని కీళ్లపై రాస్తుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. తలపై రాస్తే తలనొప్పి తగ్గుతుంది. చెవిలో రెండు చుక్కలు వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది. చర్మంపై ఏర్పడే కురుపులపై రాస్తే కురుపులు తగ్గుతాయి.

6. బంతి పువ్వుల రెక్కలకు తగినంత ఉప్పు, జీలకర్ర, కరివేపాకుల పొడిని కలిపి నెయ్యితో కొద్దిగా వేయించి తీసుకుంటే వేడి తగ్గుతుంది. మలద్వారం నుంచి రక్తం పడడం తగ్గుతుంది. మూత్రమార్గాల్లో ఉండే రాళ్లు పోతాయి. పైత్యం, వికారం తగ్గుతాయి.

7. బంతి పువ్వుల రెక్కలు, బంతి మొక్క లేత ఆకులను సేకరించి మిరియాల గింజలతో కలిపి నూరి నీళ్లతో తీసుకుంటే మూత్రంలో వచ్చే చీము తగ్గుతుంది.

8. బంతి పువ్వులను పది గ్రాముల మోతాదులో తీసుకుని శుభ్రమైన మట్టి పెంకుల మీద కాల్చి 10 గ్రాముల ఆవు నెయ్యి, చిటికెడు పచ్చ కర్పూరాన్ని కలిపి బాగా మర్దించి ఉంచుకోవాలి. దీన్ని కంటికి కాటుక మాదిరిగా పెట్టుకుంటే కంటి దురద, అలర్జీలు, కళ్ల నుంచి నీరు కారడం, కళ్ల మంట తగ్గుతాయి.

9. బంతి పువ్వుల గింజల పొడిలో సమాన భాగం చక్కెర కలిపి ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుంటే అతి కామోద్రేకం తగ్గుతుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

10. ఒక కిలో బంతి పువ్వులను కలాయిలో వేసి అందులో రెండు లీటర్ల నీరు పోసి ఒక రోజు ఉంచి అర్క యంత్రం ద్వారా అర్కం తీసి (డిస్టిలేషన్‌) సీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని ఒక టీస్పూన్‌ మోతాదులో సమాన భాగం నీళ్లు కలిపి తీసుకుంటే రక్త వికారాలు, అర్శ మొలలు, హస్త పాదాల్లో మంటలు తగ్గుతాయి.

Tags: home remediesmarigoldmarigold flowersmarigold leavesmarigold plantబంతిబంతి ఆకులుబంతి చెట్టుబంతి పువ్వులు
Previous Post

పొటాషియం మ‌న శ‌రీరానికి కావాలి.. ఇది లోపిస్తే ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో తెలుసుకోండి..!

Next Post

తెల్ల‌గా ఉండే జుట్టును న‌ల్ల‌గా మార్చుకోవ‌డానికి ఆయుర్వేదంలో ఉన్న చిట్కాలు.. త‌ప్ప‌క తెలుసుకోవాలి..!

Related Posts

మూలిక‌లు

ఏయే వ్యాధులను న‌యం చేసేందుకు తుల‌సి ఆకుల‌ను ఎలా వాడాలో తెలుసా..?

March 16, 2025
మూలిక‌లు

ఏయే ఆకులు ఎలాంటి వ్యాధుల‌ను న‌యం చేస్తాయో తెలుసా..?

March 14, 2025
మూలిక‌లు

క‌ర‌క్కాయ‌ల‌తో అద్భుత‌మైన ఆయుర్వేద చిట్కాలు.. ఏయే వ్యాధులు త‌గ్గేందుకు దీన్ని ఎలా ఉప‌యోగించాలంటే..?

February 9, 2025
మూలిక‌లు

పిచ్చి పిచ్చి ఆలోచనలకు వట్టివేర్లతో చెక్ పెట్టొచ్చు!

January 18, 2025
మూలిక‌లు

కింగ్ ఆఫ్ ఆయుర్వేద.. అశ్వగంధ..!

January 3, 2025
మూలిక‌లు

Ashwagandha Benefits : రోజూ ఒక స్పూన్ చాలు.. పురుషుల్లో ఆ శ‌క్తి పెరుగుతుంది.. ఇంకా ఎన్నో లాభాలు..!

December 18, 2024

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
lifestyle

మీ భార్య‌ను మీరు అనుక్ష‌ణం తిడుతున్నారా..? అలా చేయ‌డం పెద్ద త‌ప్పు.. ఎందుకంటే..?

by Admin
May 22, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Date Seeds : ఖ‌ర్జూరాల‌ను తింటే వాటిల్లో ఉండే విత్త‌నాల‌ను ప‌డేయ‌కండి.. ఎందుకంటే..?

by Editor
December 25, 2022

...

Read more
పండ్లు

అంజీర్ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు

by Admin
December 6, 2021

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!