బిళ్ల గన్నేరు. దీన్నే హిందీలో సదాబహార్ అని పిలుస్తారు. ఇంగ్లిష్‌లో పెరివింకిల్ అని, వింకా రోసియా అని పిలుస్తారు. సంస్కృతంలో ఈ మొక్కను సదాపుష్ప అని పిలుస్తారు. అంటే.. ఎప్పటికీ పువ్వులు పూస్తుందని అర్థం. ఈ మొక్క మన చుట్టూ పరిసరాల్లో బాగా పెరుగుతుంది. పింక్, తెలుపు రంగుల్లో పూలు పూస్తుంది. అయితే ఈ మొక్క వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అవేమిటంటే..
1. బిళ్ల గన్నేరు మొక్క ఆకులు, పసుపును కొద్దిగా తీసుకుని నీటితో కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. దాన్ని గాయాలు, పుండ్లపై రోజుకు మూడు సార్లు రాయాలి. దీంతో గాయాలు, పుండ్లు త్వరగా మానుతాయి.
2. డయాబెటిస్ ఉన్నవారికి బిళ్ల గన్నేరు మొక్క అద్భుతంగా పనిచేస్తుంది. బిళ్ల గన్నేరు మొక్క వేర్లను సేకరించి శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని నీడలో ఎండబెట్టాలి. ఎండిన తరువాత వేర్లను పొడి చేయాలి. ఆ పొడిని చిటికెడు మోతాదులో తీసుకుని దానికి ఒక టీస్పూన్ తేనె కలపాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు ఉదయం, సాయంత్రం భోజనానికి 30 నిమిషాల ముందు తీసుకోవాలి. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఎంతగానో సహాయ పడుతుంది.
3. బిళ్ల గన్నేరు మొక్క ఆకులు 5 తీసుకుని వాటి నుంచి రసం తీయాలి. ఆ రసాన్ని 2-3 ఎంఎల్ మోతాదులో తీసుకుని ఉదయాన్నే పరగడుపునే సేవించాలి. లేదా రాత్రి నిద్రకు ముందు కూడా తీసుకోవచ్చు. దీంతో హైబీపీ తగ్గుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది.
4. బిళ్ల గన్నేరు ఆకులు 8 తీసుకుని శుభ్రంగా కడిగి 2 కప్పుల నీటిలో వాటిని వేసి మరిగించాలి. అర కప్పు నీరు అయ్యే వరకు కషాయం కాయాలి. దాన్ని రోజూ ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి. ఇలా 3 నెలల పాటు చేయాలి. దీంతో స్త్రీలకు రుతు క్రమం సరిగ్గా అవుతుంది. హార్మోన్ల సమస్యలు తగ్గుతాయి. రుతు సమయంలో తీవ్ర రక్త స్రావం కాకుండా ఆపవచ్చు. నొప్పులు తగ్గుతాయి.
5. బిళ్ల గన్నేరు పువ్వులు, దానిమ్మ పువ్వు మొగ్గలను తీసుకుని కలిపి వాటి నుంచి రసం తీయాలి. దాన్ని ముక్కులో రెండు రంధ్రాల్లోనూ రెండు చుక్కల చొప్పున వేయాలి. ముక్కు నుంచి అయ్యే రక్తస్రావం తగ్గుతుంది. నోట్లో రక్తస్రావం అయ్యే చిగుళ్ల మీద ఈ మిశ్రమం వేస్తే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే నోట్లో పొక్కులు, పుండ్లు తగ్గుతాయి.
6. కీటకాలు, పురుగులు కుట్టిన చోట బిళ్ల గన్నేర ఆకుల పేస్ట్‌ను రాయాలి. దీంతో ఇర్రిటేషన్, వాపులు తగ్గుతాయి.
7. బిళ్ల గన్నేరు ఆకుల పేస్ట్, పసుపు, వేపాకుల పేస్ట్ కలిపి మిశ్రమంగా చేసి రాస్తుంటే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
బిళ్ల గన్నేరు మొక్క ఆకులు, పువ్వులు, వేర్లు అనేక అనారోగ్య సమస్యలకు పనిచేస్తాయి. నిజమే. కానీ వాటిని అతి స్వల్ప మోతాదులో తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకుంటే తీవ్ర ప్రాణాపాయ పరిస్థితులు సంభవించే అవకాశం ఉంటుంది. కనుక డాక్టర్ సలహాతో ఈ మొక్కను ఉపయోగించడం మేలు. ఇక గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, అల్సర్లు ఉన్నవారు ఈ మొక్కను ఎట్టి పరిస్థితిలోనూ వాడరాదు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365