Cinnamon : దాల్చిన చెక్క‌ను రోజూ ఏదో ఒక విధంగా తీసుకోవాల్సిందే.. లేదంటే చాలా న‌ష్ట‌పోతారు..

Cinnamon : దాల్చిన చెక్కను మ‌నం ఎక్కువ‌గా వంట‌కాల్లో ఉప‌యోగిస్తుంటాం. దీని వ‌ల్ల వంట‌ల‌కు మంచి రుచి వ‌స్తుంది. చ‌క్క‌ని వాస‌న ఉంటుంది. మ‌సాలా దినుసుగా దాల్చిన చెక్క మ‌న‌కు ఎక్కువ‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే మీకు తెలుసా..? కేవ‌లం ఆహార‌ ప‌దార్థాల‌కు రుచిని ఇచ్చే ప‌దార్థంగానే కాదు, దాల్చిన చెక్క వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా చేకూరుతాయి. దీని వ‌ల్ల ప‌లు అనారోగ్యాల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో, దాల్చిన చెక్క వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దాల్చిన‌చెక్క‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. పాలిఫినాల్స్ అన‌బ‌డే ప్ర‌త్యేక‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. ఇన్ ఫెక్ష‌న్ల బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. నొప్పులు, వాపుల‌ను తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు దాల్చిన చెక్క‌లో ఉన్నాయి. దీని వ‌ల్ల శ‌రీరం ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌దు. క‌ణ‌జాలం పాడ‌వ‌కుండా ఉంటుంది. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేసి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే గుణాలు దాల్చిన చెక్క‌లో ఉన్నాయి. దీని వ‌ల్ల గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగ‌వుతుంది.

take Cinnamon daily in any form or else you will lose these benefits
Cinnamon

డ‌యాబెటిస్ ఉన్న వారికి దాల్చిన చెక్క ఎంత‌గానో మేలు చేస్తుంది. నిత్యం 1 టీస్పూన్ మోతాదులో ఏదో ఒక విధంగా దాల్చిన చెక్క‌ను తీసుకుంటూ ఉంటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంది. రక్తంలో ఉండే చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. ఇన్సులిన్ లాంటి గుణాలు కలిగి ఉన్నందున టైప్ 2 మాత్ర‌మే కాదు, టైప్ 1 డ‌యాబెటిస్ ఉన్న వారికి కూడా ఇది మేలు చేస్తుంది. పార్కిన్స‌స్ డిసీజ్, అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గుద‌ల‌, మ‌తిమ‌రుపు వంటి స‌మ‌స్య‌లు న‌య‌మ‌వుతాయి.

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే గుణాలు దాల్చిన చెక్క‌లో ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అయితే దాంతోపాటు యాంటీ ఫంగ‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్ గుణాలు కూడా దాల్చిన చెక్క‌లో ఉన్నాయి. దీంతో ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. హెచ్ఐవీ ఎయిడ్స్ కు మందు లేద‌ని మ‌నంద‌రికీ తెలుసు. కానీ దాల్చిన చెక్క‌ను త‌ర‌చూ వాడుతూ ఉంటే హెచ్ఐవీ క్రిమి కూడా నాశ‌న‌మ‌వుతుంద‌ట‌. అలా అని ప‌రిశోధ‌న‌లే చెబుతున్నాయి. అధికంగా బ‌రువు ఉన్న వారు దాల్చిన చెక్క‌ను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటే బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును క‌రిగించే గుణాలు దాల్చిన చెక్క‌కు ఉన్నాయి. అందువల్ల దాల్చిన చెక్క‌ను రోజూ తింటే ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

Share
Editor

Recent Posts