అసలే కరోనా సమయం. గత ఏడాదిన్నర కాలం నుంచి ఆ మహమ్మారి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటికే ఎంతో మందిని బలి తీసుకుంది. దీనికి తోడు వర్షాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు మనపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. కనుక శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం తప్పనిసరి అయింది. ఈ క్రమంలోనే కింద తెలిపిన ఆయుర్వేద మూలికలను రోజూ తీసుకోవడం వల్ల శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. మరి ఆ ఆయుర్వేద మూలికలు ఏమిటంటే..
ఇది దీర్ఘాయువును అందించే, జ్ఞాపకశక్తిని పెంచే, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మూలికగా గుర్తించబడింది. ఈ మూలిక శరీర రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. శక్తిని అందిస్తుంది. మాక్రోఫేజెస్ వంటి తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ మూలిక రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. దీంతో బ్రాంకైటిస్, దీర్ఘకాలిక దగ్గు వంటి అనేక రోగాలు నయం అవుతాయి. శ్వాసకోశ వ్యవస్థలో తిప్పతీగ శ్లేష్మ పొరను శాంతింపజేస్తుంది. ఇది ఉబ్బసంకు వ్యతిరేకంగా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తిప్పతీగ బలమైన జీర్ణవ్యవస్థను ప్రోత్సహించడానికి కూడా పనిచేస్తుంది. ఇది పౌడర్ లేదా ట్యాబ్లెట్ల రూపంలో లభిస్తుంది. వాటిని రోజూ తీసుకోవచ్చు. మనకు మెడికల్ షాపుల్లో అవి లభిస్తాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. రోజూ తిప్పతీగను వాడడం వల్ల అనారోగ్యాలు రాకుండా చూసుకోవచ్చు.
భారతదేశంతో పాటు మధ్యప్రాచ్యం, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో అశ్వగంధ మొక్కలు పెరుగుతాయి. దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. దీన్నే ఇండియన్ జిన్సెంగ్ అంటారు. ఇది నొప్పులు, మంటలను తగ్గిస్తుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారికి మేలు చేస్తుంది. అశ్వగంధ ఒక అడాప్టోజెన్. ఇది ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది కరోనా సమయంలో చాలా సహాయపడుతుంది. ఇది అనేక వ్యాధులు రాకుండా మన శరీరాన్ని రక్షిస్తుంది. అశ్వగంధ క్యాప్సూల్స్, పౌడర్ లేదా ట్యాబ్లెట్లను వెచ్చని పాలు లేదా నీటితో లేదా వైద్యుడు నిర్దేశించిన విధంగా తీసుకోవచ్చు. అవి ఏ మెడికల్ స్టోర్‌లోనైనా సులభంగా లభిస్తాయి.
రోగనిరోధక శక్తిని సహజ సిద్ధంగా పెంచడంలో తులసి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది అనేక అంటు వ్యాధులను రాకుండా చూస్తుంది. సాధారణ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి సహాయపడుతుంది. శ్వాసకోశ రుగ్మతలను తొలగిస్తుంది. తులసి ఒక అడాప్టోజెన్. ఇది ఆందోళన, ఒత్తిడి, అలసటలను తగ్గిస్తుంది. ఉబ్బసం, బ్రాంకైటిస్, జలుబు, ఫ్లూ చికిత్సకు సహాయపడుతుంది. తులసిలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. తులసి ఆకులను నేరుగా నమిలి తినవచ్చు. లేదా రసం తీసి తాగవచ్చు. లేదా తులసి ట్యాబ్లెట్లను కూడా వేసుకోవచ్చు. దీంతో రోగాల బారి నుంచి రక్షణ లభిస్తుంది.
ఉసిరి అనేక రకాల అనారోగ్య సమస్యలకు, ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలకు ఉపయోగపడుతుంది. ఇది కాలేయం, గుండె, మెదడు, ఊపిరితిత్తుల పనితీరుకు తోడ్పడుతుంది. ఉసిరిలో విటమిన్ సి, అమైనో ఆమ్లాలు, పెక్టిన్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీనివల్ల ఉసిరి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీమైక్రోబయల్, గ్యాస్ట్రోప్రొటెక్టివ్, యాంటీ డయాబెటిక్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఆయా సమస్యలను తగ్గిస్తుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని నేరుగా తినవచ్చు. లేదా మార్కెట్‌లో ఉసిరి పౌడర్ లభిస్తుంది. లేదా ట్యాబ్లెట్లను కూడా వాడవచ్చు.
ఈ మూలికలను రోజూ తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. అనేక వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365