Snoring : నిద్ర పోయేటప్పుడు చాలా మందికి గురక వస్తుంటుంది. అయితే గురక పెట్టేవారికి ఏమీ అనిపించదు, తెలియదు. కానీ వారి పక్కన పడుకునే వారికి మాత్రం అది బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అస్సలు నిద్ర పట్టదు. ఈ క్రమంలో గురక సమస్య ఉన్నవారు కింద సూచించిన విధంగా పలు టిప్స్ పాటిస్తే చాలు, దాంతో గురక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు చూద్దామా.
1. ఇంట్లో పొడి వాతావరణం ఉన్నా అది గురకకు దారి తీస్తుంది. ఎలా అంటే పొడి గాలి వల్ల ముక్కు రంధ్రాలు, గొంతు ఎండిపోయి వాటిలో గాలి ప్రవేశించడం కష్టతరమవుతుంది. అందుకే గురక వస్తుంది. దీన్ని ఎలా అధిగమించాలంటే.. ఓ హ్యుమిడిఫైర్‌ను కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవాలి. దీంతో ఇంట్లో గాలి తేమగా మారి గురక సమస్య పోయేలా చేస్తుంది.
2. అధికంగా బరువున్న వారు కూడా ఎక్కువగా గురక పెడుతుంటారు. బరువు తగ్గితే గురక తగ్గేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఎక్కువ పొట్ట ఉన్నవారు కూడా గురక పెడతారు. కనుక ఆ పొట్ట తగ్గే మార్గం చూస్తే మంచిది. దీంతో గురక సమస్య కూడా తగ్గుతుంది.
3. నిత్యం యోగా, ప్రాణాయామం చేయాలి. దీంతో శ్వాస సమస్యలు సెట్ అవుతాయి. గురక తగ్గుతుంది.
4. పై దవడను అలాగే ఉంచి కింది దవడను ముందుకు తేవాలి. అనంతరం 10 అంకెలు లెక్కబెట్టాలి. ఇలా రోజుకు 7 నుంచి 10 సార్లు చేస్తే గురక సమస్య తగ్గుతుంది.
5. పలికేందుకు కష్ట సాధ్యమైన పదాలను నిత్యం 10 నుంచి 20 సార్లు పలకాలి. దీంతో గురక సమస్య పోతుంది.
6. నాలుకను బయటకు పెట్టి స్ట్రెయిట్‌గా ఉంచి కిందకు, పైకి, ఎడమకు, కుడికి తిప్పాలి. ఇలా రోజుకు 2 నుంచి 4 సార్లు చేస్తే గురక సమస్య పోతుంది.
7. పొగ తాగడం, మద్యం సేవిండం వంటి అలవాట్లు ఉన్నవారు మానేయాలి. వాటి వల్ల కూడా గురక వస్తుంది. ముఖ్యంగా నిద్రించడానికి ముందు ఈ రెండు పనులు అస్సలు చేయకూడదు.
8. నిద్రించేటప్పుడు తల కింద కచ్చితంగా దిండు పెట్టుకోవాలి. అయితే అది సాధారణం కన్నా కొంచెం ఎక్కువ ఎత్తు ఉంటే మంచిది. దీంతో గురక రాదు. అలాగే ఎప్పుడూ వెల్లకిలా పడుకోకూడదు. దీంతో గొంతులో ఎయిర్ బ్లాక్ అయి గురక వస్తుంది. కనుక ఒక పక్కకు తిరిగి పడుకుంటే గురక రాదు.
9. ఒక గ్లాస్ వేడి పాలలో కొద్దిగా పసుపు వేసి కలుపుకుని నిద్రించే ముందు తాగాలి. దీంతో గురక రాదు.
10. క్లారిఫైడ్ బటర్ లేదా బ్రాహ్మి ఆయిల్‌ను కొద్దిగా తీసుకుని వేడి చేయాలి. అందులోంచి రెండు చుక్కలను తీసి నిద్రించడానికి ముందు ముక్కు రంధ్రాల్లో వేయాలి. ఇలా రోజూ చేస్తుంటే గురక సమస్య పోతుంది.
11. ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలిపి నిద్రించడానికి ముందు తాగాలి. దీని వల్ల కూడా గురక సమస్యను పోగొట్టుకోవచ్చు.