బ్రేక్‌ఫాస్ట్ అంటే రోజంతా శరీరానికి శక్తిని అందివ్వాలి. అంతేకానీ మన శరీర బరువును పెంచేవిగా ఉండకూడదు. అలాగే శరీరానికి పోషణను కూడా అందించాలి. అలాంటి బ్రేక్‌ఫాస్ట్‌లనే మనం తినాల్సి ఉంటుంది. అలాగే తక్కువ ఖర్చు కూడా కలిగి ఉండాలి. అలాంటి ఉత్తమమైన బ్రేక్‌ఫాస్ట్‌ల వివరాలు ఇవిగో. వీటిని తినడం వల్ల శరీరానికి శక్తి లభించడమే కాదు, ఉదయాన్నే మన శరీరానికి కావల్సిన పోషకాలు దాదాపుగా అందుతాయి. మరి ఆ బ్రేక్‌ఫాస్ట్‌లు ఏమిటంటే..
గోధుమ బ్రెడ్‌ను పెనంపై కొద్దిగా నెయ్యివేసి కాల్చి తరువాత దానిపై కూరగాయలు కలిపిన ఆమ్లెట్ వేసుకుని తినాలి. దీని ద్వారా మనకు అనేక పోషకాలు లభిస్తాయి. కూరగాయల్లో పాలకూర, టమాటాలు, ఉల్లిపాయలు వంటి వాటిని వాడవచ్చు.
శనగపిండితో తయారు చేసే ఈ బ్రేక్ ఫాస్ట్‌ను తినడం వల్ల శరీరానికి ప్రోటీన్లు, ఫైబర్ లభిస్తాయి. శరీరానికి శక్తి అందుతుంది.
వేడి వేడి పాలలో ఓట్స్‌ను కలిపి, దాంతోపాటు పండ్లు, డ్రై ఫ్రూట్స్ వేసి ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను తయారు చేసుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల రోజంతటికీ కావల్సిన శక్తి, పోషకాలు లభిస్తాయి. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా తేలికే. పైగా తక్కువ సమయమే పడుతుంది. అయితే పండ్లలో అరటి పండ్లు, యాపిల్ పండ్లను వాడుకోవచ్చు.
కేవలం ఒకే నిమిషంలో ఈ బ్రేక్ ఫాస్ట్ రెడీ అవుతుంది. బ్రెడ్‌ను పెనంపై కాల్చి దాని మీద పీనట్ బటర్‌ను రాసి తినడమే. దీంతో మనకు అనేక పోషకాలు, శక్తి అందుతాయి. అయితే పీనట్ బటర్ మనకు మార్కెట్‌లో రెండు రకాలుగా లభిస్తుంది. ఒకటి.. 100 శాతం రోస్ట్ చేసిన పల్లీలతో తయారు చేసిన పీనట్ బటర్. ఇందులో హానికరమైన కొవ్వులు కలవవు. కానీ రెండో రకం పీనట్ బటర్‌లో కేవలం కొద్ది శాతం రోస్టెడ్ పల్లీలు మాత్రమే ఉంటాయి. మిగిలిన పదార్థాలన్నీ అనారోగ్యకరమైన కొవ్వులే. కనుక పీనట్ బటర్‌ను కొనేముందు అందులో రోస్టెడ్ పల్లీల శాతం ఎంత ఉందో లేబుల్‌పై చూసి చెక్ చేసుకోవచ్చు. దీంతో ఆరోగ్యకరమైన పీనట్ బటర్‌ను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఇది రుచిగా ఉండడమే కాదు, మన శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ అందుతాయి. ఇది కూడా ఉత్తమమైన బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. దీన్ని స్వీట్ లేదా కారం, ఉప్పు ఉండే విధంగా తయారు చేసుకోవచ్చు. కొద్దిగా తీపి ఉండాలంటే అరటి పండ్లు లేదా బాదంపప్పు లేదా పీనట్ బటర్‌ను వేయవచ్చు.
పోహాను సింపుల్‌గా కాకుండా అందులో కూరగాయలు వేసి తయారు చేయాలి. దీంతో మన శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. శక్తి కూడా లభిస్తుంది. కోడిగుడ్లు, పన్నీర్ వంటివి వేసుకోవచ్చు. అయితే చివర్లో నిమ్మరసం పిండి తింటే ఆ రుచే వేరేగా ఉంటుంది. దీంతోపాటు నిమ్మ రసంలో ఉండే పోషకాలు కూడా లభిస్తాయి.
అయితే పైన తెలిపిన బ్రేక్‌ఫాస్ట్‌లను తినేవారు ఉదయాన్నే అనారోగ్యకరమైన ఆహారాలను తినడం మానేయాల్సి ఉంటుంది. బిస్కెట్లు, చిప్స్, కార్న్ ఫ్లేక్స్‌ను కొందరు ఉదయాన్నే తింటారు. వాటిని తినరాదు. అందుకు బదులుగా నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ లేదా తాజా పండ్లను తినవచ్చు. ఇక టీ, కాఫీలకు బదులుగా వెన్న తీసిన పాలను తాగవచ్చు. దీంతో బ్రేక్‌ఫాస్ట్ పూర్తవుతుంది. శరీరానికి సంపూర్ణ పోషణ లభిస్తుంది.