Acidity Remedy : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది ఎసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, అజీర్తి, మలబద్దకం, పుల్లటి త్రేన్పులు వంటి వివిధ రకాల జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. మసాలాలు కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారాన్ని తీసుకోకపోవడం, జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వంటి వివిధ కారణాల చేత ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. చాలా మంది ఎసిడిటి సమస్యను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఎసిడిటీ సమస్యను నిర్లక్ష్యం చేస్తే కడుపులోఅలాగే ప్రేగులల్లో అల్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది క్రమంగా క్యాన్సర్ గా మారే అవకాశం కూడా ఉంది.
కనుక ఎసిడిటీ సమస్య నుండి వీలైనంత త్వరగా బయటపడడమే మంచిది. ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా మంది వైద్యులు సూచించిన మందులను వాడుతూ ఉంటారు. అయితే ఈ మందులను వాడడం వల్ల సమస్య తగ్గినప్పటికి మరలా కొంత కాలం తరువాత సమస్య మరలా తిరిగి వస్తుంది. అలాగే ఖాళీ కడుపుతో మందులను వాడడం, ఎక్కువగా మందులను వాడడం వల్ల ఎపిడిటీ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది. కనుక ఈ సమస్యను మనం సహజ సిద్దంగా తగ్గించుకోవడమే ఉత్తమం. కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలను వాడడం వల్ల మనం ఎసిడిటీ సమస్యను సహజ సిద్దంగా తగ్గించుకోవచ్చు. అలాగే ఈ చిట్కాలను క్రమం తప్పకుండా వాడడం వల్ల ఎసిడిటీ సమస్యను మనం శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. ఎసిడిటీ సమస్యను తగ్గించే చిట్కాలు ఏమిటి..వీటిని ఎలా వాడాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ఒక గ్లాస్ నీటిలో 20 ఎమ్ ఎల్ కాచీ చల్లర్చిన పాలు, ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి వేసి బాగా కలిపి తాగాలి. ఎసిడిటీ సమస్య ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్న వారు భోజనం చేసిన తరువాత ఈ చిట్కాను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఎసిడిటీ సమస్యను తగ్గించే మరో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం మనం పసుపును, నల్ల ఉప్పును, జీలకర్ర, నిమ్మకాయను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా జీలకర్రను వేయించి పొడిగా చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలో అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ పసుపు, అర టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు వేసి కలపాలి. తరువాత ఒక అర చెక్క నిమ్మకాయను అర సెకన్ పాటు నేరుగా మంటపై వేడి చేయాలి.
నిమ్మకాయ వేడయ్యాక దాని నుండి రసాన్ని తీసి ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని వెంటనే తాగాలి. ఈ చిట్కాను వాడడం వల్ల ఎసిడిటీ సమస్య నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కాను వాడడం వల్ల ఎసిడిటీ సమస్య తగ్గడంతో పాటు కడుపు ఉబ్బరం, కడుపులో మంట, కడుపు నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే ఎసిడిటీ సమస్యతో బాధపడే వారు మజ్జిగను తాగడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఎసిడిటీ సమస్యను తగ్గించడంలో మజ్జిగ ఎంతో సహాయపడుతుంది. ఒక గ్లాస్ మజ్జిగలో అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి, పావు టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు, కొద్దిగా బెల్లం తురుమును వేసి బాగా కలపాలి.
ఈ విధంగా మజ్జిగను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎసిడిటీ , కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు పూర్తిగా తగ్గు ముఖం పడతాయి. ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల మనం చాలా సులభంగా అలాగే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఎసిడిటీ సమస్యను నివారించుకోవచ్చు. అలాగే ఈ చిట్కాలను క్రమం తప్పకుండా వాడడం వల్ల ఎసిడిటీ సమస్య పూర్తిగా తగ్గడంతో పాటు మరలా రాకుండా కూడా ఉంటుంది.