Dondakaya 65 : మనం దొండకాయలతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. దొండకాయలతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. దొండకాయలతో చేసుకోదగిన వంటకాల్లో దొండకాయ 65 ఒకటి. ఇది చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటుంది. దొండకాయ 65 ను ఎక్కువగా క్యాటరింగ్ లలో , కర్రీ పాయింట్ లలో ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు. ఈ దొండకాయ 65 ను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా కరకరలాడుతూ ఉండేలా దొండకాయ 65 ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దొండకాయ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
దొండకాయలు – అరకిలో, పచ్చిమిర్చి – 8,అల్లం -2 ఇంచుల ముక్క, శనగపిండి – అర కప్పు, బియ్యం – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు- తగినంత, కారం – అర టీ స్పూన్, నూనె – డీప్ ప్రైకు సరిపడా, పల్లీలు – పావు కప్పు, కరివేపాకు – రెండు రెమ్మలు, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్.
దొండకాయ 65 తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకోవాలి. తరువాత ఇందులో దొండకాయ ముక్కలను వేసి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించి వడకట్టుకోవాలి. తరువాత దొండకాయ ముక్కలను గాలికి తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టుకోవాలి. తరువాత ఒక జార్ లో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ దొండకాయ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, శనగపిండి, బియ్యం పిండి, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. అవసరమైతే రెండు టీ స్పూన్ల నీళ్లు పోసుకుని కలుపుకోవాలి. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక దొండకాయ ముక్కలను వేసి వేయించుకోవాలి.
వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా కరకరలాడే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఇదే నూనెలో పల్లీలు, కరివేపాకు వేసి వేయించి దొండకాయల్లో వేసుకోవాలి. తరువాత వాటిపై జీలకర్ర పొడి, గరం మసాలా, కొద్దిగా కారం చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. దీనిని పప్పు, సాంబార్ వంటి వాటితో సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. దొండకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.