Ayurvedic Remedies For High Cholesterol : కొలెస్ట్రాల్ లెవల్స్‌ను త‌గ్గించే పానీయాలు.. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగాలి..!

Ayurvedic Remedies For High Cholesterol : నేటి త‌రుణంలో మ‌న‌లో చాలా మంది కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ర‌క్తంలో ఎక్కువ‌గా ఉండే కొలెస్ట్రాల్ కార‌ణంగా మ‌నం తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వ‌స్తుంది. గుండె ఆరోగ్యం దెబ్బ‌తిన‌డంతో పాటు అధికంగా ఉండే కొలెస్ట్రాల్ ర‌క్త‌నాళాల గోడ‌ల వెంబ‌డి పేరుకుపోయి ర‌క్త‌ప్ర‌వ‌హానికి ఆటంకం క‌లిగిస్తుంది. దీంతో గుండెపోటు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఒక్కోసారి ఇది మ‌ర‌ణానికి కూడా దారి తీయ‌వ‌చ్చు. క‌నుక ర‌క్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండేలా చూసుకోవాలి. ర‌క్తంలో ఉండే కొలెస్ట్రాల్ ను తొల‌గించ‌డంలో కొన్ని ఆయుర్వేద చిట్కాలు చ‌క్క‌గా ప‌ని చేస్తాయి. మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తో కొన్ని ర‌కాల పానీయాలను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల మ‌నం చాలా సుల‌భంగా ర‌క‌త్ంలో అధికంగా ఉండే కొలెస్ట్రాల్ ను తొల‌గించుకోవ‌చ్చు.

ర‌క్తంలో ఉండే కొలెస్ట్రాల్ ను తొలగించే పానీయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ర‌క్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను త‌గ్గించ‌డంలో అల్లం, నిమ్మ‌ర‌సం ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ సి కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. దీని కోసం ఒక గ్లాస్ లో ఒక టీ స్పూన్ అల్లం ర‌సం, ఒక టేబుల్ స్పూన్ నిమ్మ‌ర‌సం క‌లిపి రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో ఉండే కొలెస్ట్రాల్ తొల‌గిపోతుంది. అదే విధంగా ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ల్లో ఒక టీ స్పూన్ ప‌సుపు వేసి రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల పాల‌ల్లో ఉండే యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ర‌క్తంలో కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

Ayurvedic Remedies For High Cholesterol in telugu take these 7 drinks
Ayurvedic Remedies For High Cholesterol

ఇక కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో వెల్లుల్లి కూడా మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. ర‌క్తాన్ని ప‌లుచ‌గా చేసి ర‌క్తంలో ఉండే కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో వెల్లుల్లి స‌హాయ‌ప‌డుతుంది. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ తేనె, రెండు వెల్లుల్లి రెబ్బ‌ల చూర్ణాన్ని వేసి క‌లిపి ప‌ర‌గ‌డుపున తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గుతాయి. ర‌క్తంలో కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో ఉసిరికాయ ర‌సం కూడా ఎంతో తోడ్ప‌డుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విట‌మిన్ సి కొలెస్ట్రాల్ ను త‌గ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంది. ఒక పెద్ద ఉసిరికాయ నుండి తీసిన ర‌సాన్ని ఒక క‌ప్పు నీటిలో క‌లిపి రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే ఉసిరి, బిభిత‌కీ, హ‌రిత‌కి అనే త్రిఫ‌లాల నుండి త‌యారు చేసిన త్రిఫ‌లా చూర్ణాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఒక క‌ప్పు వేడి నీటిలో ఒక టీ స్పూన్ త్రిఫ‌లా చూర్ణాన్ని వేసి 5 నుండి 10 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత ఈ టీని వ‌డ‌క‌ట్టి తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. ఇక అశ్వ‌గంధ టీ ని త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల కూడా ర‌క్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఒక క‌ప్పు వేడి నీటిలో ఒక టీ స్పూన్ అశ్వ‌గంధ పొడిని వేసి 5 నుండి 10 నిమిషాల పాటు ఉంచాలి. త‌రువాత ఈ టీని వ‌డ‌క‌ట్టి ప‌ర‌గ‌డుపున తాగాలి. ఇలా తాగ‌డం వ‌ల్ల ర‌క్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. ఈ విధంగా ఈ పానీయాల‌ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల అధిక కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ల నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

D

Recent Posts