పురుషులకు గడ్డం ఎంతో అందాన్ని ఇస్తుందని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులు తెల్ల గడ్డం సమస్యతో బాధపడుతున్నారు. కారణాలు ఏవైనప్పటికీ ఈ సమస్యలతో బాధపడే పురుషుల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువవుతోంది. పూర్వకాలంలో వయసు పైబడిన పురుషుల్లో మాత్రమే మనం ఈ సమస్యను చూసే వాళ్లం. కానీ ప్రస్తుత తరుణంలో తక్కువ వయసు ఉన్న వారిలో కూడా గడ్డం తెల్లబడడాన్ని మనం గమనించవచ్చు.
తెల్లబడిన గడ్డాన్ని నల్లగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సహజసిద్ధంగా తెల్లబడిన గడ్డాన్ని చాలా సులువుగా నల్లగా మార్చుకోవచ్చు. పురుషుల్లో గడ్డాన్ని నల్లగా మార్చే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెల్ల గడ్డాన్ని నల్లగా మార్చడంలో కరివేపాకు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని కోసం గుప్పెడు కరివేపాకును తీసుకుని ఎండలో బాగా ఎండబెట్టాలి. తరువాత ఎండిన కరివేపాకును మెత్తని పొడిలా చేసుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను, ఒక టీ స్పూన్ కరివేపాకు పొడిని, ఒక టేబుల్ స్పూన్ ఆముదాన్ని కూడా వేసి కలుపుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని గడ్డానికి రాసుకుని 10 నిమిషాల పాటు మర్దనా చేయాలి. ఇలా రాసిన ఒక గంట తరువాత చల్లని నీటితో గడ్డాన్ని శుభ్రపరుచుకోవాలి. క్రమం తప్పకుండా ఈ చిట్కాను పాటించడం వల్ల చాలా త్వరగా తెల్లగా మారిన గడ్డం నల్లగా మారుతుంది.
అంతేకాకుండా ఈ చిట్కాను వాడడం వల్ల పలుచగా ఉన్న గడ్డం ఒత్తుగా కూడా పెరుగుతుంది. ఈ చిట్కాను కేవలం గడ్డానికి మాత్రమే కాకుండా తల వెంట్రుకలను నల్లగా మార్చుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. ఈ విధంగా కరివేపాకును, కొబ్బరి నూనెను, ఆముదం నూనెను ఉపయోగించడం వల్ల పురుషుల్లో గడ్డం నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది.