ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు.. ఇలా అనేక కారణాల వల్ల అనేక మందికి వెంట్రుకల సమస్యలు వస్తున్నాయి. దీంతో వెంట్రుకలు రాలిపోవడం, జుట్టు పెరుగుదల సరిగ్గా ఉండకపోవడం, వెంట్రుకలు పలుచగా మారి చిట్లి పోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే వెంట్రుకలు పెరగాలన్నా, దృఢంగా ఉండాలన్నా, ఏ సమస్యలు రాకూడదన్నా.. అందుకు కింద తెలిపిన 10 హెయిర్ ఆయిల్స్ ఉపయోగపడతాయి. వీటిని రెగ్యులర్‌గా వాడడం వల్ల వెంట్రుకల సమస్యలు ఉండవు. జుట్టు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఆ హెయిర్ ఆయిల్స్ ఏమిటంటే…
1. ఆముదం నూనె
ఈ నూనెతో జుట్టు పెరుగుదల సరిగ్గా ఉంటుంది. వెంట్రుకలు రాలిపోవడం తగ్గుతుంది. వెంట్రుకలు ఉండే ప్రాంతంలో రక్త సరఫరా సరిగ్గా జరుగుతుంది.
2. జొజొబా ఆయిల్
దురద తగ్గుతుంది. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. జుట్టు దృఢంగా మారుతుంది.
3. కొబ్బరినూనె
శిరోజాలు పెరుగుతాయి. చుండ్రు సమస్య ఉండదు. జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
4. మకడేమియా ఆయిల్
ఎండ నుంచి వెంట్రుకలకు రక్షణ లభిస్తుంది. శిరోజాలు దెబ్బ తినకుండా ఉంటాయి. వెంట్రుకలు చిట్లడం తగ్గుతుంది. జుట్టు మృదువుగా మారుతుంది.
5. అర్గన్ ఆయిల్
శిరోజాలు దృఢంగా మారుతాయి. కాంతివంతంగా ఉంటాయి.
6. అవకాడో ఆయిల్
దెబ్బతిన్న జుట్టు మరమ్మత్తు అవుతుంది. చుండ్రు సమస్య ఉండదు. జుట్టు మృదువుగా, పట్టులా మారుతుంది.
7. ఆల్మండ్ ఆయిల్
ఎండ నుంచి జుట్టుకు రక్షణ లభిస్తుంది. కాంతివంతంగా మారుతుంది. వెంట్రుకలు చిట్లడం తగ్గుతుంది.
8. ఆమ్లా ఆయిల్
వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు నల్లగా మారుతుంది. జుట్టు పెరుగుతుంది.
9. గ్రేప్ సీడ్ ఆయిల్
ఉష్ణ ప్రదేశాల్లో గడిపే వారి జుట్టుకు రక్షణ లభిస్తుంది. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. చుండ్రు సమస్య ఉండదు.
10. ఆలివ్ ఆయిల్
జుట్టు మృదువుగా మారుతుంది. కాంతివంతంగా తయారవుతుంది. ఎండ నుంచి వెంట్రుకలకు రక్షణ లభిస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.