Beauty Tip : రోజూ రాత్రి దీన్ని రాస్తే చాలు.. ఎలాంటి ముఖం అయినా స‌రే మెరిసిపోతుంది..!

Beauty Tip : వాతావ‌ర‌ణ కాలుష్యం, వాతావ‌ర‌ణంలో మార్పులు, ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం, ట్యాన్ పేరుకుపోవ‌డం వంటి వివిధ కార‌ణాల చేత మ‌న‌లో చాలా మందికి ముఖం న‌ల్ల‌గా మారుతుంది. అలాగే ముఖం కాంతిని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. ఎండ వ‌ల్ల న‌ల్ల‌గా మారిన ముఖాన్ని తెల్ల‌గా మార్చుకోవ‌డానికి ర‌క‌ర‌కాల పెయిర్ నెస్ క్రీముల‌ను వాడుతూ ఉంటారు. వీటిని వాడ‌డం వ‌ల్ల అంతగా ఫ‌లితం ఉండ‌క‌పోవ‌డంతో పాటు ఇవి ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. ఒక అద్భుత‌మైన చిట్కాను వాడి ఎండ వ‌ల్ల న‌ల్ల‌గా మారిన చర్మాన్ని చాలా సుల‌భంగా మ‌నం తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. ఈ చిట్కా చాలా ప్ర‌భావ‌వంతంగా ప‌ని చేస్తుంది. ఎండ‌లో ఎక్కువ‌గా తిర‌గ‌డం వ‌ల్ల చ‌ర్మం న‌ల్ల‌గా మారిన వారు ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితాన్ని పొంద‌వ‌చ్చు.

ముఖంపై పేరుకుపోయిన ట్యాన్ ను తొల‌గించి ముఖాన్ని తెల్ల‌గా మార్చే ఆ చిట్కా ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను త‌యారు చేసుకోవ‌డానికి గానూ మ‌నం ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ ఫేస్ మాయిశ్చ‌రైజింగ్ క్రీమును తీసుకోవాలి. త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ క‌ల‌బంద గుజ్జును, ఒక టీ స్పూన్ రోజ్ వాట‌ర్ ను, ఒక విట‌మిన్ ఇ ఆయిల్ క్యాప్సుల్ ను వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని రోజూ రాత్రి ప‌డుకునే ముందు ముఖానికి రాసుకోవాలి. దీనిని ముఖానికి ప‌ట్టించి రాత్రంతా అలాగే ఉంచాలి. ఉద‌యాన్నే నీటితో శుభ్రం చేసుకోవాలి. అయితే ఈ చిట్కాను వాడే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

Beauty Tip follow this simple remedy
Beauty Tip

శుభ్రమైన ట‌వ‌ల్ తో ముఖాన్ని తుడుచుకుని ఆ త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకోవాలి. ఈ విధంగా రోజూ రాత్రి ముఖానికి ఈ మిశ్ర‌మాన్ని రాసుకోవ‌డం వ‌ల్ల కొద్ది రోజుల్లోనే న‌ల్ల‌గా మారిన చ‌ర్మం తిరిగి సాధార‌ణ స్థితికి చేరుకుంటుంది. ఈ మిశ్ర‌మంలో ఫేస్ మాయిశ్చ‌రైజ‌ర్ కు బ‌దులుగా బాడీ మాయిశ్చ‌రైజ‌ర్ క్రీమును వేసి శ‌రీరానికి కూడా రాసుకోవ‌చ్చు. ఈ విధంగా ఈ చిట్కాను వాడ‌డం వ‌ల్ల ముఖంపై పేరుకుపోయిన న‌లుపు, ట్యాన్ తొల‌గిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా మారుతుంది. నిర్జీవంగా మారిన ముఖం తిరిగి ప్ర‌కాశ‌వంతంగా, మృదువుగా త‌యారవుతుంది.

Share
D

Recent Posts