Beauty Tips : అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడు ఉన్న వాతావరణ మార్పుల కారణంగా చాలా మంది అందాన్ని కోల్పోతున్నారనే చెప్పవచ్చు. పూర్వకాలంలో అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ఎన్నో సహజసిద్దమైన మూలికలు దొరికేవి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. ఈ తరం వారికి సహజసిద్ద పదార్థాలు, ఆయుర్వేద మూలికలు దొరకడమే కష్టమైంది. ఒకవేళ దొరికినా అవి నిజమైనవో, కల్తీవో కూడా తెలియదు. ఇలాంటి సందిగ్దంలో మనలో చాలా మంది ఉండే ఉంటారు. కనుక మనకు సులవుగా లభించే పదార్థాలతో కూడా మన అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
మన ముఖ సౌందర్యాన్ని ఒక చిన్న ఇంటి చిట్కాను ఉపయోగించి చాలా సులభంగా మెరుగుపరుచుకోవచ్చు. అందాన్ని మెరుగుపరిచే చిట్కా గురించి, ఆ చిట్కా తయారీకి కావల్సిన పదార్థాల గురించి, అలాగే దీనిని ఎలా ఉపయోగించాలి అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనకు చాలా సులభంగా లభించే పదార్థాలతో ఈ చిట్కాను తయారు చేసుకోవచ్చు. దీని కోసం మనం నిమ్మకాయలను, ఇనో ప్యాకెట్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే మనలో చాలా మందికి ఈ చిట్కాను వాడడం వల్ల ప్రయోజనం ఉంటుందా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. కనుక ఇవి మన చర్మంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అది మన చర్మంపై ఉండే మృత కణాలను తొలగిస్తుంది. నిమ్మకాయ రసం మన చర్మంపై ఉండే స్వేద గ్రంథులల్లోకి వెళ్లి అందులో ఉన్న మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. ఇనో లో ఉన్న పదార్థాలు మన చర్మంపైన ఉన్న జిడ్డును తొలగించి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తాయి. ఈ రెండు పదార్థాలను కూడా ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో ఇనో పౌడర్ ను తీసుకోవాలి. తరువాత అందులో నిమ్మరసం వేసి బాగా కలపాలి. నిమ్మరసం వేయడం వల్ల ఇనో పౌడర్ పొంగుతుంది.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ సున్నితంగా ముఖానికి రాసుకోవాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మురికి, జిడ్డు తొలగిపోయి ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఎప్పుడైనా వెంటనే బయటకు వెళ్లాలి అన్నప్పుడు ఈ చిట్కాను పాటించడం వల్ల 5 నిమిషాల్లోనే అందమైన, మెరిసే ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.