Beauty Tips : ముఖం అందంగా కనిపించాలని చాలా మంది కోరుకుంటారు. అందుకుగాను బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు. అయితే అలాంటి అవసరం లేకుండా ఒక చిన్న చిట్కాను పాటించడం ద్వారానే బ్యూటీ పార్లర్ లాంటి అందాన్ని సొంతం చేసుకోవచ్చు. చర్మ సమస్యలు ఉన్నవారు, ముఖంపై ముడతలు, మచ్చలు, మొటిలు, ఇతర సమస్యలు ఉన్నవారు, జిడ్డు కారే చర్మం ఉన్నవారు ఈ చిట్కాను పాటిస్తే చాలు.. ఒక్కటే సారి అన్ని సమస్యలు పోతాయి. ముఖం అందంగా.. కాంతివంతంగా మారుతుంది. మరి అందుకు ఏం చేయాలంటే..
ఓట్స్‌లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటి ద్వారా మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే పాలు కూడా. అయితే ఈ రెండింటినీ కలిపి ఉపయోగించడం వల్ల ముఖం అందంగా మారుతుంది. అందుకు గాను ఒక ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు-ఓట్స్ పేస్ట్‌ను ఇలా తయారు చేయాలి..
రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్‌ను తీసుకోవాలి. అర కప్పు పాలను తీసుకోవాలి. పాలలో ఓట్స్ వేసి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. అనంతరం ఆ మిశ్రమం మెత్తగా మారుతుంది. దాన్ని పేస్ట్‌లా చేసి ముఖంపై రాయాలి. అయితే ఈ మిశ్రమాన్ని అప్లై చేసే ముందు ముఖాన్ని బాగా కడగాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. దీంతో అది పొడిగా మారుతుంది. ఆ తరువాత 5 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం నీటితో కడిగేయాలి.
ఇలా వారంలో కనీసం 2 సార్లు చేస్తుండాలి. దీంతో చర్మంపై ఈ మిశ్రమం బాగా పనిచేస్తుంది. పాలు, ఓట్స్‌లో ఉండే పోషకాలు ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. యవ్వనంగా కనిపిస్తారు. మొటిమలు, మచ్చలు, కళ్ల కింద ఉండే నల్లని వలయాలు పోతాయి. జిడ్డు కారే చర్మం అందంగా కనిపిస్తుంది. ఈ మిశ్రమం బ్యూటీ పార్లర్‌లా పనిచేస్తుంది. దీంతో సహజసిద్ధంగా అందం వస్తుంది.