Beauty Tips : అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందంగా కనిపించడానికి మనం చేయని ప్రయత్నం అంటూ ఉండదు. మార్కెట్ లో దొరికే అన్ని రకాల క్రీములను, ఫేస్ వాష్ లను ఉపయోగించడంతోపాటు ఇంటి చిట్కాలను కూడా చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అయినప్పటికీ ప్రస్తుత తరుణంలో ఉన్న వాతావరణ కాలుష్యం కారణంగా, ఆందోళన, మానసిక ఒత్తిళ్ల కారణంగా చాలా మంది అనేక రకాల చర్మ సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారు. ముఖంపై మచ్చలు, మొటిమలు, పొక్కులు, ముడతల వంటి సమస్యలతో బాధ పడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ సమ్యల నుండి చాలా మంది బయటపడలేకపోతున్నారు. పైగా రసాయనాలను కలిగిన ప్రొడక్ట్స్ ను వాడి దుష్ప్రభావాల బారిన పడుతున్నారు. అయితే మనకు వచ్చే చర్మ సంబంధమైన సమస్యలన్నింటినీ నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదం ద్వారా మొటిమలను, మచ్చలను, ఇతర చర్మ సంబంధమైన సమస్యలను ఎలా నయం చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్నో ఔషధ గుణాలు కలిగిన కుప్పింటాకు మొక్క గురించి మనకు తెలుసు. ఈ మొక్క మన ఇంటి చుట్టూ పరిసరాలలో, పొలాల గట్లపై ఎక్కడపడితే అక్కడ లభిస్తూనే ఉంటుంది. దీనిని మురి పిండి, హరితమంజరి అని కూడా పిలుస్తారు. ఈ మొక్క పూలు ఆకు పచ్చ రంగులో ఉంటాయి. ఈ మొక్కను ఉపయోగించి చర్మ సంబంమైన సమస్యలన్నింటినీ నయం చేసుకోవచ్చు. ఈ మొక్క ఆకులను తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించి వడకట్టాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఈ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుండడం వల్ల ముఖం పై వచ్చే మొటిమలు, మచ్చలు, కురుపులు తగ్గుతాయి. అలాగే ఈ మొక్క ఆకులను పేస్ట్ గా చేసి అందులో పసుపును కలిపి దానిని చర్మంపై సమస్య ఉన్న చోట లేపనంగా రాయడం వల్ల కూడా మొటిమలు, మచ్చలు, ముడతలు, కురుపులు, పొక్కులు తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల సమస్యలు తగ్గి ముఖం కాంతివంతంగా తయారవుతుంది.

మెడపై, చంకలలో, గజ్జలలో ఉండే నలుపును తగ్గించడంలోనూ ఈ మొక్క ఉపయోగనడుతుంది. ఈ మొక్క ఆకుల రసానికి నిమ్మరసాన్ని కలిపి రాయడం వల్ల నలుపు తగ్గుతుంది. చర్మ సంబంధమైన సమస్యలే కాకుండా మనకు వచ్చే ఇతర అనారోగ్య సమస్యలను నయం చేయడంలోనూ ఈ మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఆకుల రసానికి వెన్నెను కలిపి తీసుకుంటే మూర్ఛ వ్యాధి తగ్గుతుంది. కుప్పింటాకు మొక్క మొతాన్ని తీసుకుని ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని 2 గ్రా . ల మోతాదులో రెండు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల ఉబ్బసం తగ్గుతుంది.
ఈ మొక్క పసరును చెవిలో వేస్తే చెవి నొప్పి తగ్గుతుంది. ఈ పసరును గాయాలపై రాసి దంచిన ఆకులను గాయంపై ఉంచి కట్టుగా కడితే గాయాలు త్వరగా మానుతాయి. ఈ మొక్క ఆకుల రసాన్ని పిప్పి పన్నుపై పోయడం వల్ల పిప్పి పన్ను వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. కుప్పింటాకు మొక్క వేరుతో దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలు గట్టి పడతాయి. ఈ మొక్క ఆకులకు వెల్లుల్లి రెబ్బలను, తమలపాకును కలిపి నూరి గోరు చుట్టు వచ్చిన వేలుపై ఉంచి కట్టుకడితే గోరు చుట్టు తగ్గుతుంది. కుప్పింటాకులను, వేప ఆకులను దంచి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానం చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. ఈ విధంగా కుప్పింటాకుతో చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడమే కాకుండా మనకు వచ్చే ఇతర అనారోగ్య సమస్యలను కూడా నయం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.