Carrot Facepack : క్యారెట్‌తో ఇలా ఫేస్‌ప్యాక్‌ల‌ను చేసి వాడండి.. మీ ముఖం త‌ళ‌త‌ళా మెరిసిపోతుంది..!

Carrot Facepack : మ‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో క్యారెట్ కూడా ఒక‌టి. క్యారెట్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. క్యారెట్ ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. వైద్యులు కూడా క్యారెట్ ను ఆహారంగా తీసుకోవాల‌ని సూచిస్తూ ఉంటారు. అయితే మ‌న‌లో చాలా మంది క్యారెట్ మ‌న శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో మాత్ర‌మే దోహ‌ద‌పడుతుంద‌ని భావిస్తారు కానీ క్యారెట్ ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల మ‌న చ‌ర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు క‌లుగుతుంది. క్యారెట్ లో విట‌మిన్ ఎ, సి, కె, బీట్ కెరోటీన్స్ వంటి పోష‌కాలు ఎన్నో ఉన్నాయి.

ఇవి మ‌న చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి చ‌ర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచ‌డంలో మ‌న‌కు దోహ‌ప‌డ‌తాయి. క్యారెట్ ను ఆహారంగా తీసుకోవ‌డంతో పాటు క్యారెట్ తో ఫేస్ ప్యాక్ ల‌ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం మన ముఖ అందాన్ని రెట్టింపు చేసుకోవ‌చ్చు. క్యారెట్ తో ఫేస్ ప్యాక్ ల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.. ఎలా వాడాలి… అలాగే వీటిని వాడం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజనాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. క్యారెట్ తో ఫేస్ ప్యాక్ ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల క్యారెట్ ర‌సాన్ని తీసుకోవాలి. త‌రువాత ఇందులో కొద్దిగా అర‌టిపండు గుజ్జు, 4 చుక్క‌ల నిమ్మ‌ర‌సం, కోడిగుడ్డు తెల‌సొన వేసి బాగా క‌ల‌పాలి.

Carrot Facepack how to prepare and use them
Carrot Facepack

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని ఆరిన త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే ముడ‌త‌లు తొల‌గిపోతాయి. ఈ చిట్కాను వారానికి మూడుసార్లు వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అదే విధంగా ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల క్యారెట్ ర‌సాన్ని తీసుకోవాలి. ఇందులో రెండు టీ స్పూన్ల బొప్పాయి పండు ర‌సం, 2 టీ స్పూన్ల క‌ల‌పాలి. ఈ విధంగా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని ఆర‌నివ్వాలి. త‌రువాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మస్య‌లు త‌గ్గి ముఖం అందంగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది. ఈ విధంగా క్యారెట్ మ‌న చ‌ర్మ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

D

Recent Posts