Ghee For Face : నెయ్యిని ఇలా వాడండి.. మీ ముఖం అందంగా మారుతుంది..!

Ghee For Face : ముఖం అందంగా క‌న‌బ‌డాల‌ని, చ‌ర్మం అందంగా, కాంతివంతంగా క‌న‌బ‌డాల‌ని ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాము. అలాగే మార్కెట్ లో ల‌భించే క్రీముల‌ను, మాయిశ్చ‌రైజ‌ర్ ల‌ను, బాడీ వాష్ ల‌ను, స‌బ్బుల‌ను, ఫేస్ ప్యాక్ ల‌ను వాడుతూ ఉంటాము. అయితే వీటి వ‌ల్ల ఎటువంటి ఫ‌లితం లేకపోగా వీటిని దీర్ఘ‌కాలం పాటు వాడ‌డం వ‌ల్ల వీటిలో ఉండే ర‌సాయ‌నాల కార‌ణంగా చ‌ర్మ ఆరోగ్యం దెబ్బ‌తినే అవ‌కాశం కూడా ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖం అందంగా క‌న‌బ‌డాల‌నుకునే వారు రసాయ‌నాలు క‌లిగిన బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను వాడ‌డానికి బ‌దులుగా నెయ్యిని వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. మ‌న శ‌రీర ఆరోగ్యంతో పాటు మ చ‌ర్మ ఆరోగ్యానికి కూడా నెయ్యి ఎంతో మేలు చేస్తుంది.

నెయ్యితో ఫేస్ స్యాక్, లిప్ బామ్, స్క్ర‌బ‌ర్, లోష‌న్, మాయిశ్చ‌రైజ‌ర్ వంటి వాటిని ఇంట్లోనే త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి అందాన్ని పొంద‌వ‌చ్చు. అలాగే చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. నెయ్యితో ఈ బ్యూటీ ప్రొడ‌క్ట్స్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. ఎలా వాడాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. నెయ్యితో మాయిశ్చ‌రైజ‌ర్ ను త‌యారు చేసుకోవ‌డానికి గానూ ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల క‌రిగించిన నెయ్యిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో అంతే ప‌రిమాణంలో క‌ల‌బంద జెల్ ను తీసుకుని అంతా క‌లిసేలా బాగా క‌ల‌పాలి. త‌రువాత గాలి త‌గ‌ల‌కుండా నిల్వ చేసుకుని ఉప‌యోగించాలి. ఇల త‌యారు చేసుకున్న మాయిశ్చ‌రైజ‌ర్ ను రాత్రి ప‌డుకునే ముందు ముఖానికి రాసుకుని 15 నిమిషాల త‌రువాత శుభ్రం చేసుకోవ‌చ్చు.

Ghee For Face use in this method for better effect
Ghee For Face

లేదంటే రాత్రంతా అలాగే ఉంచి ఉద‌యాన్నే శుభ్రం చేసుకోవ‌చ్చు. అలాగే చ‌ర్మం పొడి బార‌కుండా ఉండ‌డానికి మ‌నం బాడీ లోష‌న్ ల‌ను వాడుతుంటాము. బాడీ లోష‌న్ ల‌ను వాడ‌డం వ‌ల్ల చ‌ర్మం పొడిబార‌కుండా ఉన్న‌ప్ప‌టికి వీటి ప్ర‌భావం కొంత స‌మ‌యం వ‌ర‌కు మాత్ర‌మే ఉంటుంది. వీటికి బ‌దులుగా నెయ్యిని వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల క‌రిగించిన నెయ్యిని తీసుకోవాలి. త‌రువాత ఇందులో 3 టీ స్పూన్ల కొబ్బ‌రి నూనె లేదా బాదం నూనె వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిని గాజు సీసాలో నిల్వ చేసుకుని ఉప‌యోగించాలి. ఇలా త‌యారు చేసుకున్న నెయ్యిని చ‌ర్మానికి రాసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మం చాలా స‌మ‌యం వ‌ర‌కు పొడిబార‌కుండా ఉంటుంది. అలాగే మ‌న పెద‌వులు అందంగా, పొడిబార‌కుండా ఉండ‌డానికి లిప్ బామ్ లను వాడుతూఉంటాము.

వీటికి బ‌దులుగా నెయ్యిని వాడ‌డం వ‌ల్ల పెద‌వులు అందంగా, పొడిబార‌కుండా , ప‌గ‌ల‌కుండా ఉంటాయి. రోజూ రాత్రి ప‌డుకునే ముందు 2 లేదా 3 చుక్క‌ల నెయ్యిని పెద‌వుల‌పై రాసి సున్నితంగా మ‌ర్ద‌నా చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ప‌గిలిన పెద‌వుల‌కు త‌గినంత తేమ ల‌భించి తిరిగి సాధార‌ణ స్థితికి వ‌స్తాయి. అలాగే పెద‌వులు చ‌క్క‌టి రంగుతో అందంగా మెరుస్తాయి. అలాగే చ‌ర్మంపై పేరుకుపోయిన మృత‌క‌ణాల‌ను తొల‌గించుకోవ‌డానికి మ‌నంబాడీ స్క్ర‌బ్ ల‌ను వాడుతూ ఉంటాము. బ‌య‌ట ల‌భించే వాటిని వాడ‌డానికి బ‌దులుగా నెయ్యితో మనం చ‌క్క‌టి స్క్ర‌బ‌ర్ ను త‌యారు చేసుకోవ‌చ్చు.

దీనికోసం ఒక గిన్నెలో రెండు టీ స్పూన్ల క‌రిగించిన నెయ్యి, రెండు టీ స్పూన్ల కొబ్బ‌రి పాలు, ఒక టీ స్పూన్ పంచ‌దార‌, ఒక టీ స్పూన్ శ‌న‌గ‌పిండి వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిని చ‌ర్మానికి రాసుకుని స్క్ర‌బ్ చేసిన త‌రువాత స్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై పేరుకుపోయిన దుమ్ము. ధూళి, మృత‌క‌ణాలు తొలిగిపోవ‌డంతో పాటు చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది. అలాగే నెయ్యిలో శ‌న‌గ‌పిండి వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని ఆరిన త‌రువాత క‌డిగి వేయాలి. ఇలా నెయ్యితో ఫేస్ ప్యాక్ ను త‌యారు చేసుకుని వాడ‌డం వ‌ల్ల ముఖం అందంగా త‌యార‌వుతుంది. ఈ విధంగా నెయ్యిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ముఖం అందంగా కాంతివంతంగా క‌న‌బ‌డ‌డంతో పాటు చ‌ర్మ ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

Share
D

Recent Posts