జుట్టు రాలడం అనే సమస్య ప్రస్తుతం అధిక శాతం మందిని బాధిస్తోంది. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలు, కాలుష్యం.. తదితర అనేక కారణాల వల్ల చాలా మందికి వెంట్రుకలు రాలిపోతున్నాయి. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే జుట్టు రాలడం సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే…
* పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీ పట్టాలి. అనంతరం వచ్చే మిశ్రమాన్ని శుభ్రమైన వస్త్రంలో వేసి పాలు వచ్చేలా బాగా పిండాలి. ఇలా కొబ్బరి పాలను తీశాక వాటిని తలకు పట్టించాలి. అనంతరం 20 నిమిషాలు ఆగాలి. తరువాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
* కలబంద గుజ్జును తలకు బాగా పట్టించి 15 నిమిషాలు ఆగి తలస్నానం చేయాలి. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.
* ఒక పాత్రలో కొద్దిగా తీసుకుని అందులో కొన్ని వేపాకులను వేసి నీటిని బాగా మరిగించాలి. నీరు సగం అయ్యే వరకు మరిగించాక ఆ నీటిని చల్లార్చి అనంతరం వచ్చే మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. తరువాత కొంతసేపటికి తలస్నానం చేయాలి. దీంతో జుట్టు రాలడం సమస్య నుంచి బయట పడవచ్చు. ఇలా వారంలో కనీసం 2 రెండు సార్లు చేస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
* పచ్చి ఉసిరి కాయలను తీసుకుని వాటి గుజ్జును సేకరించి పేస్ట్‌లా చేసుకోవాలి. దాన్నుంచి రసం తీసి ఆ రసానికి కొద్దిగా నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించాలి. తరువాత కొంత సేపటికి తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే వెంట్రుకలు రాలడం తగ్గుతుంది.
* 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ తేనె, ఒక నిమ్మకాయ నుంచి రసం తీసి అన్నింటినీ బాగా కలిపి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. దీంతో జుట్టు రాలడం తగ్గి వెంట్రుకలు బాగా పెరుగుతాయి. ఇలా తరచూ చేస్తే చక్కని ఫలితం ఉంటుంది.
* 2 టేబుల్ స్పూన్ల మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ మెంతులను తీసి పేస్ట్ చేసుకోవాలి. దాన్ని 4 టేబుల్ స్పూన్ల పెరుగుకు కలపాలి. అందులో ఒక గుడ్డు తెల్లసొనను కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు కూడా ఉండదు.
* ఒక ఉల్లిపాయను తీసుకుని దాన్ని మిక్సీ పట్టి రసం తీయాలి. ఆ రసాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. 30 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. తరచూ ఇలా చేస్తే ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయట పడవచ్చు.
* కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని అందులో కొన్ని మందారపూలు వేసి బాగా మరగబెట్టాలి. మందారపూలు పూర్తిగా నలుపు రంగులోకి మారాక ఆయిల్‌ను సేకరించాలి. దాన్ని చల్లార్చి తలకు పట్టించి కొంత సేపు ఆగాక కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
* కొంచెం కొబ్బరినూనెను తీసుకుని గోరు వెచ్చగా ఉండేలా వేడి చేయాలి. అనంతరం ఆ ఆయిల్‌ను తలకు పట్టించి 30 నిమిషాలు ఆగి కడిగేయాలి. ఇలా తరచూ చేస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది.
* 2 కోడిగుడ్లను పగలగొట్టి తెల్లసొన సేకరించి దాన్ని తలకు పట్టించాలి. 20 నిమిషాలు ఆగాక షాంపూతో స్నానం చేయాలి. లేదంటే 1 కోడిగుడ్డును పగలగొట్టి తెల్లసొన సేకరించి అందులో 1 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను కూడా కలపవచ్చు. అనంతరం ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి 20 నిమిషాలు ఆగి స్నానం చేయాలి. ఈ క్రమంలో వెంట్రుకలు రాలడం తగ్గుతుంది. తరచూ ఈ చిట్కా పాటిస్తే జుట్టు సమస్యలు పోతాయి.
* బంగాళాదుంపలను తీసుకుని వాటిపై పొట్టు తీసేసి మెత్తని మిశ్రమంగా మిక్సీ పట్టుకోవాలి. అందులో 1 టీస్పూన్ తేనె, కొంత నీరు కలిపి మిశ్రమంగా చేసి దాన్ని తలకు పట్టించి 30 నిమిషాలు ఆగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. వెంట్రుకల సమస్యలు ఉండవు.
* 1 కప్పు గోరు వెచ్చని నీటిలో 2, 3 టీస్పూన్ల నిమ్మరసం వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి 30 నిమిషాలు ఆగాక తలస్నానం చేయాలి. దీంతో వెంట్రుకలు రాలిపోకుండా ఉంటాయి.
* సన్నగా తరిగిన కొత్తిమీరను మిక్సీలో పట్టి జ్యూస్‌గా చేసి అందులో అవసరం అనుకుంటే కొంత నీరు కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టుకు బాగా పట్టించాలి. తరువాత కొంత సేపు అలాగే ఉండి తలస్నానం చేయాలి. దీంతో జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.