పెద‌వులు మృదువుగా, కాంతివంతంగా మారాలంటే..?

చలికాలంలో పెదవులు సహజంగానే పగులుతుంటాయి. కొందరికి ఈ సమస్య ఎప్పుడూ ఉంటుంది. అయితే ఇందుకు గాను రసాయనాలు కలిగిన క్రీములను వాడాల్సిన పనిలేదు. మన ఇండ్లలో లభించే సహజసిద్ధమైన పదార్థాలతోనే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

health-tips-in-telugu-for-lip-problems

1. ఒక‌టి రెండు బాదం ప‌ప్పు ప‌లుకుల‌ను తీసుకుని బాగా నలపాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని పెదవుల‌కు రాయాలి. కొంత సేపు ఆగాక క‌డిగేయాలి. దీంతో పెదవులు మృదువుగా మారుతాయి. కాంతివంతంగా కనిపిస్తాయి.

2. ఒక టీస్పూన్ తేనె, 1/2 టీస్పూన్ నిమ్మ‌ర‌సంల‌ను క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని పెదవులపై రాయాలి. 15 నిమిషాలు ఆగాక వేడి నీటితో పెదవులను క‌డగాలి. తరచూ ఇలా చేస్తుంటే పెదవులు కాంతివంతంగా మారుతాయి. పెద‌వులు సహజసిద్ధమైన రంగును తిరిగి పొందుతాయి.

3. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ చ‌క్కెర‌ల‌ను తీసుకుని బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేయాలి. దీన్ని పెదవుల‌కు రాసి 15 నిమిషాలు ఆగాక వేడి నీటిలో ముంచిన గుడ్డ‌తో తుడిచేయాలి. అవ‌సరం అనుకుంటే మ‌ళ్లీ ఇంకోసారి ఇలాగే చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పెదవుల పగుళ్లు తగ్గి, పెదవులు మృదువుగా మారుతాయి.

4. అలోవెరా జెల్‌ను కొద్దిగా తీసుకుని పెదవుల‌కు రాయాలి. 15 నిమిషాలు ఆగాక వేడి నీటితో క‌డిగేయాలి. రోజూ ఇలా క‌నీసం 4, 5 సార్లు చేస్తూ ఉంటే పెదవుల ప‌గుళ్లు త‌గ్గిపోతాయి. పెదవులు కాంతివంతంగా మారుతాయి.

5. కొన్ని దానిమ్మ గింజ‌ల‌ను తీసుకుని వాటి నుంచి జ్యూస్‌ తీయాలి. ఆ జ్యూస్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. రోజూ కొద్ది మొత్తంలో ఆ జ్యూస్‌ను తీసుకుని అందులో కాట‌న్ బాల్స్ ముంచి వాటితో పెదవుల‌పై సున్నితంగా మ‌ర్ద‌నా చేయాలి. దీని వ‌ల్ల పెదవుల పగుళ్లు తగ్గి పెదవులు మృదువుగా మారుతాయి.

6. గులాబీ పువ్వుల‌ రెక్క‌ల‌ను 6, 7 తీసుకుని వాటిని అర క‌ప్పు పాల‌లో రాత్రి పూట నాన‌బెట్టాలి. ఉద‌యాన్నే పాల నుంచి పువ్వుల‌ రేకుల‌ను తీసి వాటిని మెత్త‌ని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌కు మ‌ళ్లీ కొంచెం పాల‌ను క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని పెదవుల‌కు రాయాలి. కొంత సేప‌టి త‌రువాత క‌డిగేయాలి. తరచూ ఇలా చేస్తే పెదవుల పగుళ్లు తగ్గి పెదవులు అందంగా మారుతాయి.

7. నిమ్మ‌ర‌సం, గ్లిజ‌రిన్‌ల‌ను స‌మాన భాగాల్లో తీసుకుని మిశ్ర‌మంగా క‌లుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని పెదవుల‌కు రాసి 15 నిమిషాలు ఆగాక వేడి నీటితో క‌డిగేయాలి. దీంతో పెదాల పగుళ్లు తగ్గుతాయి. పెదవులు మృదువుగా మారుతాయి.

8. కొన్ని కొత్తిమీర ఆకులను తీసుకుని బాగా న‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని పెదవుల‌కు రాసి 30 నిమిషాల పాటు వేచి ఉండాలి. అనంత‌రం వేడి నీటితో క‌డిగేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల పెదవుల పగుళ్లు తగ్గి పెదవులు మృదువుగా ఉంటాయి.

9. రాత్రి పూట నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు కొద్దిగా కొబ్బ‌రి నూనెను పెదవులకు రాయాలి. మరుసటి రోజు ఉదయాన్నే కడగాలి. దీంతో పెదవుల్లో తేమ పెరుగుతుంది. పెదవులు పగులకుండా ఉంటాయి.  మృదువుగా మారుతాయి.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts