Dark Circles : ఫేస్ ఇజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అనే మాటను మనం వినే ఉంటాం. ఎవరైనా మన ముఖాన్నే మొదటగా చూస్తారు. మన ముఖానికి అందాన్ని ఇచ్చేవి కళ్లు. అటువంటి కళ్లను మనం ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందమైన కళ్లు కలకాలం ఉండాలంటే వైద్యుడి సలహా లేకుండా మార్కెట్ లో దొరికే ఎటువంటి సౌందర్య సాధనాలను ఉపయోగించరాదు. అలాగే కళ్ల చుట్టూ ఎటువంటి ఫేస్ ఫ్యాక్ లను, మాస్క్ లను వేయరాదు. కంటి చుట్టూ పక్కల గోకడం కానీ, కళ్లను రుద్దడం కానీ చేయకూడదు.

ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మన కళ్ల చుట్టూ నల్లటి చారలు ఏర్పడుతూ ఉంటాయి. నిద్రలేమి, ధూమపానం, అలసట కారణాల వల్ల విటమిన్ సి లోపించి కళ్ల చుట్టూ నల్లటి చారలు ఏర్పడుతుంటాయి. ధూమపానం చేయడం తగ్గించుకుంటే కళ్ల కింద ఏర్పడే నల్లటి చారలను కూడా తొలగించుకోవచ్చు. అంతేకాకుండా ఉదయం పూట నోట్లో ఏర్పడే లాలాజలాన్ని నల్లటి చారలపై రాయడం వల్ల తప్పకుండా ఫలితాలను పొందవచ్చు. ఉదయం పూట నోట్లో ఏర్పడే లాలాజలం ఎంతో శక్తివంతమైనది. దీనిని ఈగ మీదా లేదా చీమ మీద కానీ ఉమ్మితే అవి వెంటనే చనిపోతాయి.
కళ్ల చుట్టూ ఉండే నల్లటి చారలను తొలగించుకోవడానికి లాలాజలం రాయడం ఇబ్బందిగా ఉంటే పావు టీ స్పూన్ బాదం నూనెలో పావు టీస్పూన్ నిమ్మరసం కలిపి కళ్ల కింద చారలపై రాయడం వల్ల కూడా చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. ఇలా బాదం నూనెను రాయడం వల్ల చారలు తొలగిపోయి కళ్లు అందంగా కనబడతాయి. చదివేటప్పుడు ప్రతి పది సెంకడ్లకొకసారి కళ్లు ఆర్పుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల నల్లటి చారలు తొలిగిపోవడంతోపాటు కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.
చాలా మంది స్త్రీలు కళ్లు అందంగా కనబడాలని వాటికి ఏవేవో లేపనాలు రాయడం, మేకప్ చేయడం వంటివి చేస్తూ ఉంటారు. కళ్లకు మేకప్ చేయడం మంచి పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల కళ్ల చుట్టూ ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా తగిన చర్యలు తీసుకుంటూ, కళ్లను కాపాడుకుంటూ అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు.