Lemon Juice For Pimples : మొటిమలు.. మనల్ని వేధించే చర్మ సమస్యల్లో ఇది కూడా ఒకటి. యుక్త వయసులో ఉన్న వారిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం, జిడ్డు చర్మం, హార్మోన్ల అసమతుల్యత, మారిన ఆహారపు అలవాట్లు వంటి వివిధ కారణాల చేత ఈ సమస్య తలెత్తుతుంది. మొటిమల వల్ల ముఖం అందంగా కనిపించకపోవడంతో పాటు వాటి వల్ల విపరీతమైన నొప్పి, బాధ కూడా కలుగుతుంది. ఇలా మొటిమలతో బాధపడే వారు బయట లభించే క్రీములను, ఫేస్ వాస్ లను వాడడానికి బదులుగా నిమ్మరసాన్ని ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మొటిమలను తగ్గించడంలో నిమ్మరసం ప్రభావవంతంగా పని చేస్తుంది.
నిమ్మరసాన్ని ఉపయోగించి చిన్న చిన్న చిట్కాలను తయారు చేసుకుని వాడడం వల్ల మొటిమల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. మొటిమల సమస్యతో బాధపడే వారు నిమ్మరసాన్ని ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొటిమల సమస్యతో బాధపడే వారు నిమ్మరసాన్ని మొటిమలపై నేరుగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీని కోసం ముందుగా ముఖాన్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. తరువాత తడి లేకుండా తుడుచుకోవాలి. ఇప్పుడు గిన్నెలో నిమ్మరసాన్ని తీసుకుని కాటన్ బాల్ సహాయంతో ముఖానికి రాసుకోవాలి. దీనిని పది నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి.
ఇలా రోజుకు రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అయితే నిమ్మరసాన్ని రాసుకోవడం వల్ల కొందరి చర్మంపై మంట, చికాకు కలుగుతుంది. ఇలాంటి వారు వెంటనే నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే నిమ్మరసాన్ని రాసుకుని ఎండలో తిరగవద్దు. అదే విధంగా నిమ్మరసంలో, రోజ్ వాటర్ ను కలిపి మొటిమలపై రాయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. దీని కోసం ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకుని తడి లేకుండా తుడుచుకోవాలి. తరువాత ఒక గిన్నెలో నిమ్మరసాన్ని, రోజ్ వాటర్ ను తీసుకుని కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ సహాయంతో మొటిమలపై రాసుకోవాలి. దీనిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేయడం వల్ల మొటిమల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.