Ripen Banana For Beauty : బాగా పండిన అర‌టి పండుతో ఇలా చేస్తే.. మీ ముఖం మెరిసిపోతుంది.. బ్యూటీ పార్ల‌ర్ అవ‌స‌రం ఉండ‌దు..

Ripen Banana For Beauty : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది త‌మ అందానికి అధికంగా ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. స్త్రీలే కాదు.. పురుషులు కూడా అందంగా ఉండేందుకు అనేక మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు. అందులో భాగంగానే ఏవేవో క్రీముల‌ను వాడ‌డం.. బ్యూటీ పార్ల‌ర్ల‌కు వెళ్ల‌డం.. వంటివి చేస్తున్నారు. అయితే ఇలాంటివేవీ లేకుండానే స‌హ‌జ‌సిద్ధంగానే ఒక చిట్కాను పాటించ‌డం వ‌ల్ల ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. దీంతో ముఖం కాంతివంతంగా కూడా మారుతుంది. అలాగే ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోతాయి. ఇందుకు గాను మ‌నం బాగా పండిన అర‌టి పండును ఉప‌యోగించాల్సి ఉంటుంది. దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

బాగా పండిన అర‌టి పండును తీసుకుని దాన్ని స‌గం క‌ట్ చేయాలి. స‌గం ముక్క‌ను తీసుకుని బాగా మెదిపి పేస్ట్‌లా చేయాలి. అందులో పావు కప్పు ఓట్ మీల్‌, ఒక టీస్పూన్ తేనె, ఒక టీస్పూన్ పెరుగును వేసి బాగా క‌ల‌పాలి. దీంతో ఫేస్ ప్యాక్ రెడీ అవుతుంది. దీన్ని ముఖానికి బాగా ప‌ట్టించాలి. త‌రువాత 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంత‌రం గోరు వెచ్చ‌ని నీళ్ల‌తో క‌డిగేయాలి. త‌రువాత ముఖంపై రోజ్ వాట‌ర్‌ను చ‌ల్లుకోవాలి. దీన్ని ఒక గంట‌య్యాక మ‌ళ్లీ క‌డిగేయాలి. ఇలా వారంలో క‌నీసం 2 సార్లు చేయాలి.

Ripen Banana For Beauty know how to use it
Ripen Banana For Beauty

ఈ చిట్కాను రెగ్యుల‌ర్‌గా పాటించ‌డం వ‌ల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖం స‌హ‌జ‌సిద్ధంగా అందంగా మారుతుంది. చ‌ర్మం మృదువుగా అవుతుంది. అలాగే ముఖంపై ఉండే అన్ని ర‌కాల మ‌చ్చ‌లు, మొటిమ‌లు త‌గ్గుతాయి. ఇందులో వాడేది అన్నీ స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాలే. క‌నుక బ్యూటీ పార్ల‌ర్ కు వెళ్ల‌కుండానే అలాంటి అందాన్ని మనం ఈ ఫేస్ ప్యాక్‌తో పొంద‌వ‌చ్చు. అర‌టి పండు, తేనె, పెరుగు, ఓట్ మీల్‌ల‌లో చ‌ర్మాన్ని సంర‌క్షించి మృదువుగా మార్చే గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. కనుక ఈ చిట్కా ఏ చ‌ర్మం ఉన్న‌వారికి అయినా స‌రే ప‌ర్‌ఫెక్ట్‌గా ప‌నిచేస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. దీంతో ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు.

Editor

Recent Posts