Bitter Gourd Powder For Diabetes : మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా మనం అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నాము. మనలో చాలా మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. షుగర్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని నిపుణులు కూడా చెబుతున్నారు. ఒక్కసారి ఈ సమస్య బారిన పడితే జీవితాంతం మందులు మింగాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే కొందరిలో మందులు మింగినప్పటికి షుగర్ వ్యాధి నియంత్రలో లేకుండా పోతుంది. అయితే నిపుణులు మాత్రం ఎల్లప్పుడూ షుగర్ వ్యాధిని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకోవాలని లేదంటే మనం అనేక ఇతర అనారోగ్య సమస్యల బారిన కూడా పడాల్సి వస్తుందని చెబుతున్నారు.
షుగర్ వ్యాధి నియంత్రణలో లేని వారు అలాగే షుగర్ వ్యాధితో బాధపడే వారు కాకరకాయను తీసుకోవడం వల్ల తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని వారు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కాకరకాయ అద్భుతంగా పని చేస్తుంది. అయితే చాలా మంది కాకరకాయను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి పూర్తిగా నయం అవుతుందని భావిస్తారు కానీ కాకరకాయను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో మాత్రమే ఉంటుంది. కాకరకాయలో కరాటిన్, మమోర్డిసిన్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అలాగే కాకరకాయలో ఉండే పాలిపెప్టైడ్ అనే రసాయన సమ్మేళనం ఇన్సులిన్ లాగా పని చేసి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో దోహదపడుతుంది.
షుగర్ వ్యాధితో బాధపడే వారు కాకరకాయను ఏ రూపంలోనైనా తీసుకోవచ్చు. కాకరకాయ కూర వండుకుని తినవచ్చు. అలాగే కాకరకాయ జ్యూస్ చేసి తీసుకోవచ్చు. అదే విధంగా కాకరకాయను పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి. ఈ పొడిని అర టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. ఈ విధంగా కాకరకాయను తీసుకోవడం వల్ల మనం అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కాకరకాయను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తం శుద్ది అవుతుంది. గాయాలు త్వరగా మానుతాయి. కడుపులో నులిపురుగులు నశిస్తాయి. ఎముకలు బలంగా తయారవుతాయి. బరువు తగ్గడంలో కూడా కాకరకాయలు మనకు సహాయపడతాయి. ఈ విధంగా కాకరకాయలను తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి అదుపులో ఉండడంతో పాటు మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.