ఒళ్లు నొప్పులను తగ్గించే.. సహజసిద్ధమైన పదార్థాలు..!

శారీరక శ్రమ ఎక్కువగా చేయడం.. అలసటకు గురి కావడం.. ఇతర పనుల వల్ల నీరసం రావడం.. వంటి అనేక కారణాల వల్ల కొందరికి విపరీతంగా ఒళ్లు నొప్పులు వస్తాయి. జ్వరం ఏమీ ఉండదు కానీ ఒళ్లంతా నొప్పి అనిపిస్తుంది. అయితే అలాంటి వారు ఇంగ్లిష్‌ మెడిసిన్‌ వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో సహజసిద్ధంగా లభించే పలు ఆహార పదార్థాలను తీసుకుంటే చాలు.. ఒళ్లు నొప్పులు ఇట్టే తగ్గుతాయి. మరి ఆ పదార్థాలు ఏమిటంటే…

body pains home remedies in telugu

* ఎర్రని రంగులో చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించే చెర్రీ పండ్లను తినడం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. సైంటిస్టులు ఈ విషయాన్ని నిరూపించారు కూడా.

* అల్లం రసం సేవించడం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. కండరాలు, కీళ్ల నొప్పులు మాయం అవుతాయి. వాపులు తగ్గుతాయి.

* ఓట్స్‌లో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల వాటిని తింటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే వాటిలో ఉండే జింక్‌ నొప్పులను తగ్గించేందుకు సహాయ పడుతుంది.

* వెల్లుల్లిని సహజసిద్ధమైన పెయిన్‌కిల్లర్‌ అని చెప్పవచ్చు. దీన్ని నేరుగా తీసుకున్నా లేదా.. ఆ రెబ్బలను నలిపి వేడి చేసి ఆలివ్‌ ఆయిల్‌తో కలిపి శరీరంపై మర్దనా చేసుకున్నా.. నొప్పులు తగ్గుతాయి.

* ఒళ్లు నొప్పులు బాగా ఉంటే ఒక కప్పు ద్రాక్ష పండ్లను తినాలి. ముఖ్యంగా వెన్ను నొప్పి తగ్గుతుంది.

Admin