బిర్యానీ ఆకులతో 3 వారాల్లో బరువు తగ్గండిలా..!

బిర్యానీ ఆకులను రకరకాల బిర్యానీలను తయారు చేసేందుకు వాడుతుంటారు. అలాగే పలు మసాలా కూరలతోపాటు నాన్‌ వెజ్‌ కూరల్లోనూ వీటిని వేస్తుంటారు. వీటిని ఆహారం తినేటప్పుడు తీసుకోరు. పక్కన పడేస్తారు. కేవలం రుచి, వాసన కోసమే వీటిన వంటల్లో వేస్తుంటారు. అయితే బిర్యానీ ఆకులతో తయారు చేసే మిశ్రమాన్ని తాగితే అధిక బరువును కేవలం 3 వారాల్లోనే తగ్గించుకునేందుకు వీలుంటుంది.

biryani leaves for weight loss

ఒక పాత్రలో 1 లీటర్‌ నీటిని తీసుకోవాలి. ఆ నీటిని బాగా మరిగించాలి. నీరు బాగా మరిగాక అందులో 1 చిన్న దాల్చిన చెక్క, 5 బిర్యానీ ఆకులు వేసి స్టవ్‌ను సన్నని మంటకు మార్చి మరో 5 నిమిషాల పాటు నీటిని బాగా మరిగించాలి. తరువాత స్టవ్‌ ఆర్పి ఆ మిశ్రమంలో ఒక నిమ్మకాయను పూర్తిగా రసం పిండాలి. తరువాత అందులో 3 టీస్పూన్ల తేనెను వేసి గోరు వెచ్చగా ఉండగానే తాగేయాలి.

ఈ మిశ్రమాన్ని వారంలో వరుసగా 4 రోజులు రోజూ ఉదయాన్నే పరగడుపునే తాగాల్సి ఉంటుంది. తరువాత 3 రోజులు గ్యాప్‌ ఇచ్చి మళ్లీ ఇంకో వారంలో అలాగే చేయాలి. ఇలా 3 వారాల పాటు చేస్తే ఆశించిన ఫలితాలు కనిపిస్తాయి. అయితే బరువు అప్పటికీ తగ్గకపోతే ఇంకో దశ ట్రై చేయవచ్చు. లేదా ఆశించిన ఫ‌లితాలు వ‌చ్చిన వారు కూడా ఇంకా బ‌రువు త‌గ్గాలంటే ఈ మిశ్ర‌మాన్ని గ్యాప్‌తో వాడుకోవ‌డం ఉత్త‌మం.

కిడ్నీ సమస్యలు, నాడీ సంబంధ సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు పైన తెలిపిన మిశ్రమాన్ని సేవించరాదు. మిశ్రమాన్ని తీసుకోగానే ఏవైనా సమస్యలు అనిపిస్తే వెంటనే మిశ్రమం తీసుకోవడాన్ని ఆపేయాలి. ఈ మిశ్రమం అందరిలోనూ పనిచేయాలని లేదు. కనుక ఎవరి సొంత నిర్ణయం మేరకు వారు దీన్ని వాడుకోవడం మంచిది. పైన చెప్పిన విధంగా మిశ్రమాన్ని తయారు చేస్తే అది 3 నుంచి 4 కప్పులు అవుతుంది. కనుక ముగ్గురు లేదా నలుగురు ఈ మిశ్రమాన్ని ఒకేసారి సేవించవచ్చు.

ఈ మిశ్రమాన్ని సేవించడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పురాతన కాలం నుంచి బిర్యానీ ఆకులను పలు ఔషధాల తయారీలో ఉపయోగిస్తున్నారు. కనుక ఈ ఆకులు ఆయా సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

Admin

Recent Posts