Cardamom Powder For High BP : చిటికెడు అంటే చిటికెడు చాలు.. జ‌న్మ‌లో బీపీ రాదు..!

Cardamom Powder For High BP : మారిన జీవ‌న విధానంవ కార‌ణంగా త‌లెత్తుతున్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ల్లో బీపీ కూడా ఒక‌టి. మారిన ఆహార‌పు అల‌వాట్లు, జీవ‌న విధానం, ఒత్తిడి, ఆందోళ‌న వంటి అనేక కార‌ణాల చేత చాలా మంది ఈ స‌మ‌స్య బారిన ప‌డుతున్నారు. వ‌య‌సుతో సంబంధం లేకుండా అంద‌రూ బీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా యుక్త‌వ‌య‌సులో ఉన్న వారు ఈ స‌మ‌స్య బారిన ఎక్కువ‌గా ప‌డుతున్నారని నిపుణులు చెబుతున్నారు. బీపీ కార‌ణంగా గుండెపోటు, మూత్ర‌పిండాల వైఫ‌ల్యం, ప‌క్ష‌వాతం వంటి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. బీపీ ని సైలెంట్ కిల్ల‌ర్ గా వైద్యులు అభివ‌ర్ణిస్తూ ఉంటారు. బీపీ క్ర‌మ క్ర‌మంగా శ‌రీర ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బ‌తీస్తుంది. చాలా మంది ఈ స‌మ‌స్య‌కు మందులు వాడిన‌ప్ప‌టికి అది అదుపులో ఉండ‌డం లేద‌ని వైద్యులు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.

చాలా మంది ఈ స‌మ‌స్య‌ను చిన్న స‌మ‌స్య‌గా భావించి నిర్ల‌క్ష్యం చేస్తూ ఉంటారు. కానీ బీపీ స‌మ‌స్య చిన్న స‌మ‌స్య కాద‌ని దీనిని అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు. బీపీ కార‌ణంగా మ‌నం అనేక ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొవాల్సి వస్తుంది క‌నుక యుక్త వ‌య‌సులో ఉన్న‌వారు ఎప్ప‌టిక‌ప్పుడు బీపీకి సంబంధించిన ప‌రీక్ష‌లు చేయించుకోవాలి. చాలా మంది త‌మ‌కు ఎటువంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డం లేద‌ని ప‌రీక్ష‌లు చేయించుకోరు. కానీ ఎటువంటి ల‌క్ష‌నాలు క‌నిపించ‌క‌పోయిన బీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే అవ‌కాశం ఉంద‌ని క‌నుక ప‌రీక్ష‌లు త‌ప్ప‌కుండా చేయించుకోవాల‌ని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ స‌మ‌స్య మొద‌టి ద‌శ‌లో ఉన్న వారు వెంట‌నే స‌మ‌స్య త‌గ్గ‌డానికి మందులు వాడ‌డానికి బ‌దులుగా స‌హ‌జ సిద్దంగా ల‌భించే ఒక ప‌దార్థాన్ని వాడ‌డం వ‌ల్ల బీపీ రెండు నెలల్లో అదుపులోకి వ‌స్తుందని మందులు వాడే అవ‌స‌రం ఉండ‌ద‌ని నిపుణులు చెబుతున్నారు.

Cardamom Powder For High BP take daily for many benefits
Cardamom Powder For High BP

బీపీ మొద‌టి ద‌శ‌లో ఉన్న వారు యాల‌క్కాయ‌లను వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఉద‌యం 3 గ్రాములు, సాయంత్రం 3 గ్రాముల యాల‌కుల పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల రెండు నుండి మూడు నెలల్లోనే మొద‌టి ద‌శ‌లో ఉన్న బీపీ అదుపులోకి వ‌స్తుంద‌ని వారు చెబుతున్నారు. మందులు వాడే అవ‌స‌రం లేకుండా యాల‌కుల పొడిని వాడ‌డం వ‌ల్ల మొద‌టి ద‌శ‌లో ఉన్న బీపీ అదుపులోకి వ‌చ్చింద‌ని వైద్యులు జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అలాగే బీపీ అదుపులోలేని వారు రోజూ ఉద‌యం రెండు యాల‌కుల‌ను, సాయంత్రం రెండు యాల‌కుల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బీపీ అదుపులోకి వ‌స్తుంద‌ని వారు చెబుతున్నారు. ఈ విధంగా బీపీని త‌గ్గించ‌డంలో యాల‌కులు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయ‌ని బీపీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు వీటిని వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంద‌ని ఈ స‌మ‌స్య‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయోద్ద‌ని నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts