Cough : వాతావరణం మారినప్పుడల్లా మనలో చాలా మంది దగ్గు, జలుబుల బారిన పడుతుంటారు. పిల్లలే కాక పెద్దలు కూడా ఈసమస్య బారినపడుతుంటారు. దగ్గు, జలుబు కారణంగా తలనొప్పి, జ్వరం, ఒంటి నొప్పులు వచ్చే అవకాశం ఉంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు తలెత్తగానే మనం జాగ్రత్త పడాలి. తీసుకునే ఆహారంలో మార్పు చేసుకోవాలి. చాలా మంది ఇటువంటి సమస్యలు తలెత్తగానే యాంటీ బయాటిక్ మందులను, దగ్గు సిరప్ లను వాడుతూ ఉంటారు. వీటి వల్ల ఉపశమనం కలిగినప్పటికి భవిష్యత్తులో తీవ్ర దుష్ప్రభావాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇలా తరచూ యాంటీ బయాటిక్స్ ను వాడడం వల్ల శరీరంలో వ్యాధి రోగనిరోధక తగ్గిపోతుంది. కావున మనం వీలైనంత వరకు మన శరీరానికి మందులను దూరంగా ఉంచాలి.
దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలను ఒక ఇంటి చిట్కా ఉపయోగించి మనం దూరం చేసుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం వల్ల మనం దగ్గు, జలుబు నుండి సత్వర ఉపశమనాన్ని పొందవచ్చు. దగ్గు, జలుబు వంటి వైరస్ ఇన్ఫెక్షన్ లను దూరం చేసే ఇంటి చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం రెండు చిన్న ఎర్ర ఉల్లిపాయలను, ఒక ఇంచు అల్లం ముక్కను, గుప్పెడు తులసి ఆకులను తీసుకోవాలి. తరువాత వీటిని విడివిడిగా మిక్సీ పట్టుకుని వాటి నుండి రసాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటి నుండి తీసిన రసాన్ని ఒక గిన్నెలో వేసి కలపాలి. తరువాత ఇందులో రెండు చిటికెల పసుపును, రెండు చిటికెల మిరియాల పొడిని వేసి కలపాలి.
చివరగా ఇందులో ఒక టీ స్పూన్ తేనెను వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని సంవత్సరం దాటిన పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. పిల్లలకు ఈ మిశ్రమాన్ని అర టీస్పూన్ మోతాదులో రెండు పూటలా ఇవ్వాలి. ఇది గాటుగా ఉంటుంది కనుక పిల్లలు దీనిని తాగలేరు. కనుక ఈ మిశ్రమాన్ని వారికి గోరు వెచ్చని పాలల్లో కూడా కలిపి ఇవ్వవచ్చు. అలాగే పెద్దలు ఈ మిశ్రమాన్ని పూటకు ఒక టీస్పూన్ మోతాదులో మూడు పూటలా తీసుకోవాలి. అదేవిధంగా విపరీతంగా దగ్గు వచ్చినప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకోవడం వల్ల దగ్గు నుండి సత్వర ఉపశమనం కలుగుతుంది. దగ్గు, జలుబులతో బాధపడే వారు ఈ విధంగా మిశ్రమాన్ని తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ చిట్కా తయారీలో మనం ఉపయోగించిన పదార్థాలన్నీ కూడా సహజ సిద్దమైనవే. వీటిని వాడడం వల్ల మనం ఎటువంటి దుష్ప్రభావాల బారిన పడకుండా ఉంటాం. ఈ మిశ్రమాన్నితీసుకోవడం వల్ల గొంతులో, ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం తొలగిపోతుంది. శరీరంలో రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. అలాగే ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన మలినాలు, విష పదార్థాలన్నీ కూడా తొలగిపోతాయి.