Cough And Throat Problems : ద‌గ్గు, గొంతు స‌మస్య‌ల‌కు 5 అద్భుత‌మైన చిట్కాలు..!

Cough And Throat Problems : వాతావ‌ర‌ణం మారిందంటే చాలు మ‌న‌లో చాలా మంది ద‌గ్గు, జ‌లుబు, గొంతునొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. అలాగే ఇది దీపావ‌ళి పండుగ స‌మ‌యం. ఈ స‌మ‌యంలో గాలిలో కాలుష్యం అధికంగా ఉంటుంది. వాతావ‌ర‌ణ కాలుష్యం కార‌ణంగా కూడా చాలా మంది శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. క‌ళ్లు మండ‌డం, గొంతునొప్పి, ద‌గ్గు, ముక్కు నుండి నీరు కార‌డం వంటి వివిధ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ ఉంటారు. ద‌గ్గు, జ‌లుబు, గొంతునొప్పి వంటి స‌మ‌స్య‌ల నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి చాలా మంది మందులు వాడుతూ ఉంటారు. ఇలా మందులకు బ‌దులుగా కొన్ని ఇంటి చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌ల నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు.

వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా, గాలి కాలుష్యం కార‌ణంగా వ‌చ్చే ద‌గ్గు, జ‌లుబు, గొంతునొప్పి వంటి శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించే ఇంటి చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గొంతునొప్పి వేధిస్తున్న‌ప్పుడు హెర్బ‌ల్ టీని త‌యారు చేసి తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఒక గిన్నెలో రెండు క‌ప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. ఇందులోనే అల్లం, తుల‌సి ఆకులు, న‌ల్ల మిరియాలు, ల‌వంగాలు వేసి క‌ప్పు నీరు అయ్యే వ‌ర‌కు బాగా మ‌రిగించాలి. త‌రువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి తేనె క‌లిపి తీసుకోవాలి. ఇలా హెర్బ‌ల్ టీని త‌యారు చేసి తీసుకోవ‌డం వల్ల గొంతునొప్పి స‌మ‌స్య త‌గ్గుతుంది. అలాగే గొంతునొప్పిని త‌గ్గించ‌డంలో మిరియాలు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. గొంతునొప్పితో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు మిరియాల‌ను నేరుగా నోట్లో వేసి న‌మిలి మింగ‌వ‌చ్చు.

Cough And Throat Problems 5 home remedies
Cough And Throat Problems

ఇలా తీసుకోలేని వారు మిరియాల‌ను పొడిగా చేసి తేనెతో క‌లిపి కొద్ది కొద్దిగా చ‌ప్పరిస్తూ మింగాలి. ఇలా చేయ‌డం వల్ల గొంతునొప్పి నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే గొంతునొప్పి, ఛాతిలో నొప్పి, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లతో బాధ‌ప‌డుతున్న‌ప్పుడు గోరు వెచ్చ‌ని నీటిలో ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ నీటిని గొంతులో పోసుకుని పుక్కిలించాలి. ఇలా రోజుకు 3 నుండి 4 సార్లు చేయ‌డం వల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అదే విధంగా పాలల్లో ప‌సుపు వేసి తీసుకోవ‌డం వల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. ద‌గ్గు, జ‌లుబు, గొంతునొప్పి వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు పాల‌ల్లో ప‌సుపు వేసి తీసుకోవాలి. ప‌సుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియ‌ల్, యాంటీ వైర‌ల్, యాంటీ అల‌ర్జిక్ గుణాలు ఇన్పెక్ష‌న్ త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

రోజూ రాత్రి ప‌డుకునే ముందు గోరు వెచ్చ‌ని పాల‌ల్లో ప‌సుపు వేసి తీసుకోవ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు, గొంతునొప్పి వంటి స‌మ‌స్య‌ల నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అలాగే ములేతిని తీసుకోవ‌డం వల్ల కూడా మంచి ఫ‌లితం ఉంటుంది. దీనిని వాస‌న‌ను పీల్చినా లేదా దీనితో క‌షాయాన్ని చేసి తీసుకున్నా లేదా దీనిని పొడిగా చేసి తేనెతో క‌లిపి తీసుకున్నా.. ఇలా ఎలా తీసుకున్నా కూడా శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌న్నింటి నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఈ విధంగా ఈ చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల శ్వాస సంబంధిత స‌మ‌స్య‌ల‌న్నింటిని నుండి మ‌న‌కు చ‌క్క‌టి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.

D

Recent Posts