Curd For Hair Fall : చలికాలం వచ్చిందంటే చాలు మనలో చాలా మంది తలలో చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. తలలో చర్మం పొడిబారడం వల్ల, వాతవరణ కాలుష్యం వల్ల చుండ్రు సమస్య ఎక్కువగా తలెత్తుతుంది. ఈ సమస్య పిల్లల నుండి పెద్దల వరకు అందరిని వేధిస్తుంది. చుండ్రు కారణంగా తలలో దురద, జుట్టు రాలడం, చికాకు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. చాలా మంది ఈ సమస్య నుండి బయటపడడానికి రకరకాల షాంపులను, నూనెలను వాడుతూ ఉంటారు. అయినప్పటికి కొందరిలో ఈ సమస్య ఏ మాత్రం తగ్గదు. అలాంటి వారు ఇప్పుడు చెప్పే చిట్కాలను వాడడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. ఈ చిట్కాలను తయారు చేసుకోవడం చాలా సులభం.
అలాగే వీటిని వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందే తప్ప ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు. చుండ్రు సమస్యను తగ్గించే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ఒక గిన్నెలో 4 టీ స్పూన్ల పెరుగు, అర చెక్క నిమ్మరసం, ఒక టీస్పూన్ ఆవనూనె వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు బాగా పట్టించి ఒక గంట పాటు అలాగే ఉంచాలి. తరువాత కుంకుడు రసంతో తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య క్రమంగా తగ్గుతుంది. ఈ చిట్కాను వాడడం వల్ల తలచర్మం పొడిబారకుండా ఉంటుంది.
తలలో ఇన్పెక్షన్, దురద వంటివి తగ్గుతాయి. అలాగే ఒక గిన్నెలో 3 టీ స్పూన్ల పెరుగు, 5 లేదా 6 టీ స్పూన్ల ఉల్లిపాయ రసం వేసి బాగా కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివరి వరకు బాగా పట్టించి గంట పాటు అలాగే ఉంచాలి. తరువాత రసాయనాలు తక్కువగా ఉండే షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా ఈ చిట్కాను పాటించడం వల్ల జుట్టు రాలే సమస్య క్రమంగా తగ్గుతుంది. జుట్టు సమస్యలన్నీ తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ విధంగా ఈ చిట్కాలను పాటించడం వల్ల చుండ్రు సమస్యతో పాటు జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.