Curry Leaves For Hair : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. జుట్టు రాలడం, జుట్టు పెరగకపోవడం, చుండ్రు, జుట్టు పొడిబారడం, తలలో దురద, తెల్ల జుట్టు వంటి వివిధ రకాల జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడే వారు నేటి తరుణంలో ఎక్కువవుతున్నారు. పోషకాహార లోపం, వాతావరణ కాలుష్యం, రసాయనాలు కలిపిన షాంపులను, కండీష్ నర్ లను వాడడం అలాగే వివిధ రకాల అనారోగ్య సమస్యల వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. జుట్టు ఆరోగ్యంగా, ధృడంగా ఉండాలని మనం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం. అయినప్పటికి ఎటువంటి ఫలితం లేక మనలో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎటువంటి ఖర్చు లేకుండా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మనం చాలా సులభంగా జుట్టును ఒత్తుగా, ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.
జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మనకు కరివేపాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. కరివేపాకును ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా తయారవుతాయి. జుట్టు తెల్లబడడం తగ్గుతుంది. జుట్టు పొడవుగా, ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. అయితే ఈ ప్రయోజనాలను పొందాలంటే కరివేపాకును ఎలా ఉపయోగించాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టుకు సంబంధించిన వివిధ రకాల సమస్యలతో బాధపడే వారు ముందుగా జుట్టుకు తగినంత కరివేపాకును తీసుకోవాలి. తరువాత కరివేపాకును శుబ్రంగా కడిగి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్ లో పెరుగును కలిపి జుట్టుకు పట్టించాలి. తరువాత సున్నితంగా మర్దనా చేసుకోవాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు, తలలో దురద వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
జుట్టుకు కావల్సినంత తేమ అంది జుట్టు పొడిబారడం తగ్గుతుంది. జుట్టు మృదువుగా తయారవుతుంది. అలాగే కరివేపాకుతో జుట్టు సమస్యలను తొలగించే మరో చిట్కాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కరివేపాకును తీసుకుని శుబ్రంగా కడగాలి. తరువాత దానిని జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత దీని నుండి రసాన్ని తీయాలి. ఈ కరివేపాకు రసంలో తగినంత షాంపును కలిపి జుట్టుకు పట్టించాలి. దీనిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు పొడవుగా, నల్లగా పెరుగుతుంది. జుట్టు కాంతివంతంగా తయారవుతుంది. ఈ విధంగా కరివేపాకుతో చిట్కాలను తయారు చేసుకుని వాడడం వల్ల జుట్టు సమస్యలన్నీ చాలా సులభంగా దూరం చేసుకోవచ్చని అందమైన, ఒత్తైన, ఆరోగ్యవంతమైన జుట్టును సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.