రోజూ గుప్పెడు వేరుశెన‌గ‌ల‌ను తింటే.. బోలెడు లాభాలు..!

వేరుశెన‌గ‌లు.. కొంద‌రు వీటిని ప‌ల్లీలు అని కూడా పిలుస్తారు. ఎలా పిలిచినా స‌రే.. వీటిల్లో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. అవ‌న్నీ మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మే. ప‌ల్లీల‌తో అనేక మంది అనేక ర‌కాల వంట‌లు చేసుకుంటారు. అయితే నిత్యం గుప్పెడు ప‌ల్లీల‌ను తింటే.. దాంతో మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

verusenaga pappu uses in telugu

* నిత్యం పల్లీలు తినడం వల్ల క్యాన్సర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. పల్లీలలో ఫాలీ ఫినోలిక్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్క‌లంగా ఉంటాయి. ఇవి గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్ రాకుండా చూస్తాయి. కార్సినోజెనిక్ ప‌దార్థాల‌ను శ‌రీరం నుంచి బ‌య‌ట‌కు పంపుతాయి. వీటిని త‌ర‌చూ తినడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వ‌చ్చే అవ‌కాశాలు కూడా త‌గ్గుతాయి.

* ప‌ల్లీల‌ను తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది. వీటిలో మోనో అన్ శాచురేటుడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఈ క్ర‌మంలో అధిక బ‌రువు కూడా తగ్గుతారు. అలాగే శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. దీంతో గుండె వ్యాధులు రావు.

* ప‌ల్లీల‌ను రోజూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల విట‌మిన్ బి3 ల‌భిస్తుంది. దీంతో మెద‌డు చురుగ్గా ఉంటుంది. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. ముఖ్యంగా పిల్ల‌ల‌కు నిత్యం ఒక గుప్పెడు ప‌ల్లీల‌ను తినిపిస్తే ఎంతో మంచిది. ఈ క్ర‌మంలో వారు అన్ని అంశాల్లోనూ బాగా రాణించేందుకు వీలుంటుంది.

* వేరుశెన‌గ‌ల్లో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది. ఇది సెర‌టోనిన్‌ను ఎక్కువగా ఉత్ప‌త్తి చేస్తుంది. దీనివ‌ల్ల‌ డిప్రెష‌న్, ఒత్తిడి, ఆందోళ‌న త‌దిత‌ర మాన‌సిక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

* రోజూ వేరుశెన‌గ‌ల‌ను తింటే గాల్ స్టోన్స్ వ‌చ్చే అవ‌కాశాలు చాలా వ‌ర‌కు త‌గ్గుతాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.

* వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా స‌హ‌జంగానే కొంద‌రికి అల్జీర్స్ వ‌స్తుంటుంది. అయితే ప‌ల్లీల‌ను తింటే ఆ వ్యాధి వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉంటాయి. వృద్ధాప్యంలో మ‌తిమ‌రుపు ఎక్కువ‌గా రాకుండా ఉంటుంది.

* గ‌ర్భిణీలు రోజూ ప‌ల్లీలు తింటే ఫోలిక్ యాసిడ్ వారికి ఎక్కువ‌గా ల‌భిస్తుంది. దీంతో బిడ్డ ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. పోష‌కాహార లోపం లేకుండా బిడ్డ జ‌న్మించేందుకు అవ‌కాశం ఉంటుంది.

* రోజూ గుప్పెడు ప‌ల్లీల‌ను తింటే శ‌రీరంలో శ‌క్తి బాగా పెరుగుతుంది. ఎక్కువ సేపు ప‌నిచేసినా అల‌సిపోకుండా ఉంటారు. దీంతోపాటు రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts