Fenugreek Seeds Powder : షుగ‌ర్ ను కంట్రోల్ చేసే పొడి ఇది.. రోజూ భోజ‌నంలో 1 టీస్పూన్ క‌లిపి తినాలి..!

Fenugreek Seeds Powder : షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ‌వుతుంది. పెద్ద‌వారితో పాటు న‌డివ‌య‌స్కులు, యువ‌త కూడా షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డుతున్నారు. కార‌ణాలేవైన‌ప్ప‌టికి షుగ‌ర్ వ్యాధి మ‌న‌లో చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఈ స‌మ‌స్య బారిన ప‌డితే జీవితాంతం మందులు మింగాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. మందులు వాడినా ఈ షుగ‌ర్ అదుపులోకి ఇబ్బంది ప‌డే వారు అలాగే ఈ మందులను వాడ‌డం వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల బారిన ప‌డే వారు కూడా ఉన్నారు. మందులు వాడిన‌ప్ప‌టికి అదుపులోకి రాని ఈ షుగ‌ర్ వ్యాధిని స‌హజ సిద్ద ప‌దార్థాల‌ను ఉయోగించి త‌గ్గించుకోవ‌చ్చు. షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో మ‌న వంట గ‌దిలో ఉండే మెంతులు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. మెంతుల‌కు షుగ‌ర్ వ్యాధిని నియంత్రించే శ‌క్తి ఉంద‌ని వారు నిపుణులు ప‌రిశోధ‌న‌ల ద్వారా వెల్ల‌డించారు. రోజూ ఉద‌యం, సాయంత్రం రెండు పూట‌లా 5 గ్రాముల మెంతి పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

ఈ మెంతి పొడిని నేరుగా తీసుకోలేని వారు దానిని భోజ‌నం చేసేట‌ప్పుడు మొద‌టి ముద్ద‌లో నెయ్యితో క‌లిపి తీసుకోవ‌చ్చు లేదా కూర‌లో కూడా క‌లిపి తీసుకోవ‌చ్చు. ఈ విధంగా మెంతి పిండిని తీసుకుంటూనే వంట‌ల్లో ఉప్పు, నూనెను త‌గ్గించాలి. అన్నానికి బ‌దులుగా పుల్కా, రోటి వంటి వాటిని తినాలి. పుల్కాల‌ను తిన‌లేని వారు జొన్న‌లు, కొర్ర‌లు, రాగులు, అరికెలు వంటి వాటితో అన్నాన్ని త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. అలాగే సాయంత్రం పూట కూడా పుల్కా కూర‌ల్లో లేదా పెరుగులో క‌లిపి ఈ మెంతిపిండిని తీసుకోవాలి. అయితే షుగ‌ర్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్న‌వారు సాయంత్రం పూట ఉడికించిన ఆహారాల‌ను తీసుకోవ‌డానికి బదులుగా డ్రై ఫ్రూట్స్ ను, పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి త్వ‌ర‌గా నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది.

Fenugreek Seeds Powder take daily one spoon to control sugar levels
Fenugreek Seeds Powder

వీటిలో కొవ్వు ప‌దార్థాలు, ప్రోటీన్లు ఎక్కువ‌గా కార్బోహైడ్రేట్స్ త‌క్కువ‌గా ఉంటాయి. దీంతో షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. అలాగే వీటిపై కూడా మెంతి పొడిని చ‌ల్లుకుని తీసుకోవాలి. ఆహార నియ‌మాలు పాటిస్తూ మెంతి పొడిని వాడ‌డం వల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది. ఇలా షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లోకి వ‌చ్చిన త‌రువాత షుగ‌ర్ వ్యాధికి వాడే ఇత‌ర మందుల మోతాదును త‌గ్గించుకోవాలి. వైద్యున్ని సంప్ర‌దించి ర‌క్త‌ప‌రీక్ష‌లు చేయించుకుని ఈ మందుల మోతాదును త‌గ్గించుకోవాలి. ఈ విధంగా మెంతుల పిండిని తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. అలాగే ముందుల వాడ‌కం వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల బారిన కూడా ప‌డ‌కుండా ఉంటారు.

Share
D

Recent Posts