Hair Tips : పొడవైన, నల్లని జుట్టు ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు, ఆహార పద్ధతులలో అది అసాధ్యం అనే చెప్పాలి. అయితే కొన్ని పద్దతులు పాటిస్తే పొడవాటి జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు. అవేంటో చూడండి. చాలా మంది నేను జుట్టుకు ఆయిల్ అప్లై చేస్తా అయినా కూడా ఊడిపోతుంది అని వాపోతుంటారు కానీ.. ఆ ఆయిల్ ఎలా అప్లై చేస్తున్నారన్నది పట్టించుకోరు.. జుట్టు పెరగడం అనేది కుదుళ్లనుండే స్టార్ట్ అవుతుంది.. అలాంటప్పుడు ఓన్లీ వెంట్రుకలకే నూనె పెడితే ఏమైనా ఫలితం ఉంటుందా.. ఉండదు కదా.. కనుక కుదుళ్లకు కూడా నూనె అంటేలా చూసుకోవాలి.
కొంచెం గోరు వెచ్చని కొబ్బరినూనెను జుట్టు కుదుళ్లకు అప్లై చేయాలి. అందువల్ల జుట్టుకు పోషణ సరిగ్గా లభిస్తుంది. జుట్టు పొడవుగా పెరుగుతుంది. గుడ్లలో ఉండే ప్రోటీన్ జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో తోడ్పడుతుంది. కాబట్టి పదిహేను రోజులకొకసారి అయినా జుట్టుకి గుడ్డుని అప్లై చేయాలి. గుడ్డుని అప్లై చేశాక 10 నుండి 20 నిమిషాలపాటు అలాగే వదిలేసి తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. జుట్టు పెరగడంలోనే కాదు మెరవడానికి కూడా గుడ్డులోని ప్రోటీన్ హెల్స్ చేస్తుంది. కనుక తరచూ గుడ్డును జుట్టుకు రాస్తుండాలి.
అయితే గుడ్డుని అప్లై చేయడానికి ఇష్టపడని వారు గుడ్డు స్థానంలో పెరుగును వాడవచ్చు. పెరుగును ఒక బౌల్ లో తీసుకుని జుట్టు మొత్తానికి పట్టించి 10 నుండి 20 నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చని నీటితో కడిగేయాలి. నెలలో రెండుసార్లు ఈ విధంగా చేస్తే మెరిసే జుట్టు మీ సొంతమవుతుంది. కలబంద, జొజొబా ఆయిల్ మరియు తేనె ఈ మూడింటిని సమపాళ్లల్లో తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి తలస్నానం చేసినట్టయితే మీ వెంట్రుకలలో వచ్చే మార్పుని మీరే గమనిస్తారు. అలాగే షాంపూ చేసుకోవడానికి ముందు గోరువెచ్చని నీటితో జుట్టుని కడగాలి. ఇది మీ జుట్టుని పట్టి ఉంచే దుమ్ము, నూనె లాంటి వాటిని పోగొడుతుంది. షాంపూ చేసి ఎలా పడితే అలా రుద్దేయకుండా తలపై వృత్తాకారంలో బాగా రుద్దాలి. దీంతో జుట్టు బాగా శుభ్రపడుతుంది.
ఇక తలస్నానం చేశాక టవల్ ని తలవెంట్రుకలకు చుట్టి ఉంచాలి. ఈ విధంగా కనీసం 30 నిమిషాలపాటు కట్టి ఉంచితే వెంట్రుకల కుదుళ్లను బలంగా చేయడంలోనే కాదు జుట్టు సాప్ట్ గా, సిల్కీగా ఉండడానికి తోడ్పడుతుంది. అలాగే వెంట్రుకలను దువ్వేటప్పుడు కూడా దువ్వెన శుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి. దాంతో పాటు ఎలాపడితే అలా దువ్వకుండా ఒక క్రమ పద్దతిలో దువ్వుకుంటూ రావాలి. అప్పుడు వెంట్రుకలు రాలడాన్ని తగ్గించవచ్చు. ఫైనల్ గా ఇవన్నీ చేసినప్పటికీ సరైన పోషకాహారం తీసుకోకపోతే అంతా వృథా ప్రయాసే. కాబట్టి పండ్లు, కూరగాయలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు లభించి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.