Whiten Teeth : మనలో చాలా మందికి దంతాలు పసుపు రంగులో ఉంటాయి. దంతాలు పసుపు రంగులో ఉండడం వల్ల వారు అనేక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. దంతాల పసుపు రంగులో ఉండడం వల్ల నలుగురితో చక్కగా మాట్లాడలేకపోతారు. చక్కగా నవ్వలేకపోతారు.దంతాలు పసుపు రంగులో మారడానికి అనేక కారణాలు ఉంటాయి. ధూమపానం, టీ, కాఫీలను ఎక్కువగా తాగడం, నీటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, వేరే అనారోగ్య సమస్యలకు మందులు వాడడం వంటి వివిధ కారణాల చేత దంతాలు పసుపు రంగులోకి మారతాయి. దంతాలు పసుపు రంగులోకి మారడం వల్ల క్రమంగా దంతాల ఆరోగ్యం కూడా దెబ్బతింటుదనే చెప్పవచ్చు. కనుక దంతాలపై ఉండే పాచిని, పసుపుదనాన్ని తొలగించుకోవడం చాలా అవసరం.
దంతాలు పసుపు రంగులో ఉన్న వారు ఎలాంటి దుష్ప్రభావాలు లేని చక్కటి చిట్కాలను వాడడం వల్ల దంతాలపై ఉండే పసుపుదనం తొలగిపోయి దంతాలు తెల్లగా మారతాయి. ఈ చిట్కాలను వాడడం వల్ల దంతాలపై ఉండే పాచి, గార తొలగిపోవడంతో పాటు నోటిలో ఉండే బ్యక్టీరియా కూడా నశిస్తుంది. దంతాల మరియు చిగుళ్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దంతాల సమస్యలు తగ్గు ముఖం పడతాయి. దంతాలపై ఉండే పసుపుదనాన్ని తొలగించి దంతాలను తెల్లగా, ఆరోగ్యంగా మార్చే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ మనం సగం టమాట ముక్కను, ఒక పూర్తి నారింజ తొక్కను ఉపయోగించాల్సి ఉంటుంది.ముందుగా ఒక జార్ లో టమాట ముక్క, నారింజ తొక్క వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిని బ్రష్ తో తీసుకుని దానిపై కొద్దిగా ఉప్పు చల్లి దంతాలను శుభ్రం చేసుకోవాలి.
నెమ్మదిగా 4 నుండి 5 నిమిషాల పాటు దంతాలను శుభ్రం చేసుకున్న తరువాత ఒక నిమిషం పాటు నోటిలో దీనిని అలాగే ఉంచాలి. ఒక నిమిషం తరువాత మనం ఉపయోగించే సాధారణ టూత్ పేస్ట్ తో దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై ఉండే గార, పసుపుదనం తొలగిపోయి దంతాలు తెల్లగా, ఆరోగ్యంగా మారతాయి. అలాగే దంతాలు పసుపు రంగులో ఉన్న వారు బేకింగ్ సోడాను వాడడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెలో, అర టీ స్పూన్ వంటసోడా, పావు టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బ్రష్ తో తీసుకుని దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా దంతాలను తెల్లగా మార్చుకోవచ్చు. అయితే ఈ చిట్కాను వారానికి ఒక సారి నెలకు రెండు సార్లు మాత్రమే ఉపయోగించాలి. అలాగే సున్నితమైన దంతాలు, చిగుళ్లు ఉన్న వారు ఈ చిట్కాను వాడకపోవమే మంచిది.
ఇక నల్ల నువ్వులను వాడడం వల్ల కూడా మనం దంతాలను తెల్లగా ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. నోట్లో 2 లేదా 3 టీ స్పూన్ల నల్ల నువ్వులను వేసుకుని బాగా నమలాలి. వీటిని మింగకుండా నోట్లో అలాగే ఉంచుకోవాలి. తరువాత బ్రష్ మీద 4 లేదా 5 చుక్కల లవంగాల నూనెను వేసి దంతాలను రుద్దుకోవాలి. ఇలా 3 నుండి 4 నిమిషాల పాటు దంతాలను రుద్దిన తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై ఉండే పాచి, పసుపుదనం తొలగిపోయి దంతాలు తెల్లగా మారతాయి. దంతాల నొప్పులు కూడా తగ్గుతాయి. ఈ విధంగా ఈచిట్కాను ప్రతిరోజూ వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వీటితో పాటు ప్రతిరోజూ 4 నుండి 5 లీటర్ల నీటిని తాగాలి. నోటికి చక్కగా శుభ్రం చేసుకోవాలి. భోజనం చేసిన సోంపును నోట్లో వేసుకుని నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై ఉండే పాచి తొలగిపోతుంది. ఈ విధంగా ఈ చిట్కాలను వాడడం వల్ల దంతాలను సులభంగా తెల్లగా మార్చుకోవచ్చు.